లగడపాటి సర్వేలో జగన్‌కు అంతంతే: బాబు, కెసిఆర్‌లదే

హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ సంస్థ తరఫున చేసిన సర్వే ఫలితాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు. లగడపాటికి చెందిన ఆర్జీఎస్ ప్లాష్ టీమ్ ఈ సర్వే చేసింది.

Lagadapati Rajagopal's exit poll survey

సీమాంధ్ర టిడిపిదే

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 115 నుండి 125 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 45 నుండి 55 అసెంబ్లీ స్థానాలే గెలుచుకుంటుందన్నారు. టిడిపి, బిజెపి కూటమి 19-22 లోకసభ స్థానాలు, వైయస్సార్ కాంగ్రెస్ 3-6 లోకసభ స్థానాలు గెలుస్తుందని చెప్పారు.

తెలంగాణలో తెరాసకే అధికం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి 50-60 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెసు పార్టీకి 30 నుండి 40 స్థానాలు వస్తాయని చెప్పారు. టిడిపి, బిజెపి కూటమి 18 నుండి 22, మజ్లిస్ పార్టీ 7-9 గెలుస్తాయన్నారు. లోకసభ విషయానికి వస్తే తెరాసకు 8-10, కాంగ్రెస్ పార్టీకి 3 నుండి 5, బిజెపి టిడిపి కూటమికి 3 నుండి 4 స్థానాలు వస్తాయని చెప్పారు.

Lagadapati Rajagopal's exit poll survey

ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా ఉంటే....

ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నా టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. విడిపోతే సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటమి, తెలంగాణలో తెరాస అధికారంలోకి వస్తుందని తేలిందన్నారు.

కేంద్రంలో ఎన్డీయేదే అధికారం

కేంద్రంలో ఎన్డీయేదే అధికారమన్నారు. బిజెపి పార్టీ పరంగా 270 నుండి 280 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. ఎన్డీయే కూటమి 320 నుండి 330 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 70 నుండి 80 లోకసభ స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+