వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి, సజ్జల సంచలనం : అల్లుడి గురించి అత్తే చెప్పాలి; మోడీని బోసడీకే అని పలకరించాలి !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క చంద్రబాబు 36 గంటల నిరాహార దీక్ష కొనసాగుతుంటే, మరోపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరు మార్కెట్ సెంటర్లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోపాటు, వైసిపి నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుంది; బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుంది: విజయసాయి రెడ్డివెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుంది; బద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుంది: విజయసాయి రెడ్డి

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి

అల్లుడు గురించి మాట్లాడితే అత్తే మాట్లాడాలి అంటూ చంద్రబాబు గురించి తానే మాట్లాడాలని పేర్కొన్న లక్ష్మీపార్వతి, చంద్రబాబు ఎన్టీఆర్ ను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. టిడిపి అధినేత మంగళగిరిలో చేస్తున్న 36 గంటల నిరసన కార్యక్రమం మీద సెటైర్లు వేసిన లక్ష్మీపార్వతి అల్లుడు చేస్తున్న నిరాహారదీక్ష పక్కనుండే వచ్చానని అక్కడ నిరాహారదీక్ష వద్ద బిర్యానీ కోసం, డబ్బుల కోసం మాట్లాడుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తినడం కోసమే మధ్య తెర కట్టారు అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు మోసం చేశాడని, ఎన్టీఆర్ చాలా అమాయకుడని లక్ష్మీపార్వతి తెలిపారు.

 లోకేష్ కు అబద్ధాలతో పాటు అవన్నీ నేర్పింది చంద్రబాబే

లోకేష్ కు అబద్ధాలతో పాటు అవన్నీ నేర్పింది చంద్రబాబే

ఇప్పటివరకు చంద్రబాబు ఏపీలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని మాట్లాడిన లక్ష్మిపార్వతి కానీ రాష్ట్రంలో రోజుకో రకంగా న్యూసెన్స్ సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు అబద్ధంతో పుట్టాడో లేక ఆయనతో అబద్ధం పుట్టిందో తెలియదు అంటూ మాట్లాడిన లక్ష్మీపార్వతి అసమర్థుడైన కొడుక్కి చంద్రబాబు అవినీతి నేర్పాడంటూ మండిపడ్డారు. లోకేష్ కు అబద్ధాలు నేర్పాడు, ఇప్పుడు తిట్టడం కూడా నేర్పాడు అంటూ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారానికి చంద్రబాబుకి ఎంత దూరమో అందరికీ తెలిసిందేనని లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. దుష్టుడు, దుర్మార్గుడైన చంద్రబాబు విధానాలు మారలేదంటూ లక్ష్మీపార్వతి తిట్టిపోశారు.

చంద్రబాబును టార్గెట్ చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి

చంద్రబాబును టార్గెట్ చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. జనాగ్రహ దీక్షలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. టిడిపి కార్యాలయం నిజంగా దేవాలయం వంటిదని ఆ పార్టీ నేతలు భావిస్తే, ముందుగా బూతులు తిట్టిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం చంద్రబాబుకు ఉందని పేర్కొన్న సజ్జల చంద్రబాబు గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు అంటూ ఆరోపణలు గుప్పించారు.

డయాబెటిక్ పేషెంట్ చంద్రబాబు అర లీటర్ నీళ్ళతో రోజంతా ఎలా దీక్ష చేస్తున్నారో ?

డయాబెటిక్ పేషెంట్ చంద్రబాబు అర లీటర్ నీళ్ళతో రోజంతా ఎలా దీక్ష చేస్తున్నారో ?

అంతేకాదు డయాబెటిక్ పేషెంట్ అయిన చంద్రబాబు అరలీటరు నీళ్లతో రోజంతా ఎలా దీక్షలు చేస్తున్నారో చెప్పాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్ అమాయకుడని, కుట్రలు కుతంత్రాలు చేతగావని, కానీ చంద్రబాబు కుట్రలకు కేరాఫ్ అంటూ మండిపడ్డారు. నిజంగా జగన్ మోహన్ రెడ్డి అనుకుంటే దాడి మరో రకంగా ఉంటుందని సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చిచెప్పారు. రాజకీయాలు హుందాగా ఉండాలని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసి ఘర్షణలకు కారణమవుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైసిపి కోరుతుందని, సోమవారమే ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

 ప్రధాని మోడీని, అమిత్ షా ను బోసడీకే అని పలకరిస్తారా ?

ప్రధాని మోడీని, అమిత్ షా ను బోసడీకే అని పలకరిస్తారా ?


బోసడికే అంటే బాగున్నారా అని అర్థం అని టీడీపీ నేతలు చెబుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రి అమిత్ షా ను అదేవిధంగా పలకరిస్తారా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. పట్టాభి మాట్లాడిన మాటపై ముఖ్యంగా మహిళల్లో చర్చ జరగాలన్నారు. రాజకీయ పదకోశంలో ఇలాంటి పదం ఉండకూడదని సజ్జల సూచించారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు తప్పని చంద్రబాబు అనుకోవడం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పార్టీలకు స్థానం ఉండకూడదని పేర్కొన్న సజ్జల తెలుగుదేశం పార్టీలో వివేకం ఉన్నవాళ్లు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. పట్టాభి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు కాబట్టి అభిమానులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి . తాము దాడి చేయాలనుకుంటే వేరేలా ఉంటుందని, ఏదో పది మంది పిల్లల్ని పంపిస్తామా అంటూ వ్యాఖ్యానించారు సజ్జల.

పట్టాభి వ్యాఖ్యల దుమారం .. కొనసాగుతున్న దీక్షలు, షాకింగ్ విమర్శలు

పట్టాభి వ్యాఖ్యల దుమారం .. కొనసాగుతున్న దీక్షలు, షాకింగ్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలు దుమారం రేపగా అప్పటి నుండి ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రగడ కొనసాగుతుంది. టిడిపి నేత పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు,ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసిన దాడులు, తెలుగుదేశం పార్టీ ఆందోళనలు వెరసి రాష్ట్రంలో మొదలైన రచ్చ కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36గంటల దీక్షను చంద్రబాబు నిర్వహిస్తున్న క్రమంలో వైసీపీ నేతలు జనాగ్రహ యాత్రలతో చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అటు చంద్రబాబు సైతం జగన్మోహన్ రెడ్డిని, ఏపీ డీజీపీ ని, వైసిపి నేతల తీరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఘాటుగా, దారుణంగా ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు.

English summary
Lakshmi Parvathi shocking comments on Chandrababu, said that people are taking about biryani in chandrababu Deeksha. Sajjala Ramakrishna Reddy asked to greet Chandrababu Modi and Amit Shah as Bosadike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X