జగన్! నా కోసం సినిమా చేస్తారా? ఎవరూ నమ్మరు: లక్ష్మీ పార్వతి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం గురించి ప్రస్తావించిన దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మనస్తత్వం తెలిసిన వారెవరూ కూడా ఈ సినిమా జగన్ తీయిస్తున్నాడని అనరని అన్నారు.

అంతేగాక, తెలుగుదేశం పార్టీ కూడా అనలేదన్నారు. ఎందుకంటే, ఆ అబ్బాయి(జగన్) ఎన్నికలకే ఖర్చు పెట్టడని తమ పార్టీలో తామే బాధపడుతుంటామని లక్ష్మీపార్వతి అన్నారు.

 lakshmi parvathi on lakshmi's ntr biopic production issue

అలాంటి ఓ లక్ష్మీపార్వతి కోసం, ఎన్టీఆర్ కోసం జగన్ మోహన్ రెడ్డి సినిమా తీస్తాడనేది పచ్చి అబద్ధం' అని ఆమె అన్నారు. కాగా, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP leader Lakshmi Parvathi responded on Lakshmi's NTR biopic production issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి