లగడపాటిపై కేసు పెట్టిన లాయర్ .. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక వుంది ఎవరో విచారణ జరపాలని ఫిర్యాదు
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి పలువురు నష్టపోవటానికి లగడపాటి రాజగోపాల్ కారణం అయ్యారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అదలా వుంటే తప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే కారణంగా మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై కేసు నమోదు చెయ్యటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తన సర్వేలెక్కలు చెప్పారు . అయితే, ఆయన సర్వే పూర్తిగా తప్పయ్యింది . టీడీపీ విజయం సాధిస్తుంది అని ఆయన సర్వే ఫలితాలను వెల్లడించగా టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది.
ప్రభంజనంలా వైసీపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం సాధించింది. అయితే లగడపాటి సర్వేల వల్ల ఏపీలోని చాలా మంది ప్రజలు చాలా విధాలుగానష్టపోయారని,తప్పుడు సర్వేలతో లగడపాటి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఓ లాయర్ .పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

లగడపాటి తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో తేల్చానని ఆయన పోలీసులను కోరారు.మురళీకృష్ణ ఫిర్యాదుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా లగడపాటి రాజగోపాల్ అంచనా తప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ దఫాకూడా ఆయన అంచనా తప్పటంతో ఇక సర్వేలనుండి సన్యాసం తీసుకోనున్నట్టు ప్రకటించారు లగడపాటి రాజగోపాల్ .












Click it and Unblock the Notifications