రైల్వేకు సాయం చేస్తున్న అల్యూమినియం బాక్స్
రైలు ప్రయాణమంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. రైలు జర్నీ చేసే సమయంలో పట్టాల పక్కన ఓ అల్యూమినియం బాక్సును చూసే ఉంటారు. అసలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అల్యూమినియం బాక్సులను ఆక్సిల్ కౌంటర్లు అని పిలుస్తారు. ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. రాకపోకలు సాగించే రైళ్ల సమాచారాన్ని డిపార్ట్ మెంట్ కు అందిస్తాయి.
ప్రతి ఐదు లేదంటే ఆరు కిలోమీటర్లకు ఒక చోట వీటిని ఏర్పాటు చేస్తారు. లొకేషన్ బాక్స్ లు అని కూడా పిలుస్తారు. వచ్చిపోయే రైళ్ల సమాచారాన్ని ఇవి గుర్తిస్తాయి. ఈ బాక్సులో ఒక డివైస్ ఉంటుంది. దీనికి పట్టాల మధ్య ఉండే మరో డివైస్ తో వైఫై కనెక్షన్ కలిగివుంటాయి. రైలు వెళ్లినప్పుడు పట్టాల మధ్య ఉండే డివైస్ వెళ్లిన రైలుకు ఎన్ని బోగీలున్నాయో గుర్తిస్తుంది. రైలుకు ఉండే చక్రాల మధ్య ఆక్సిల్స్ ఉంటాయి. ఒక్కో బోగీకి నాలుగు ఆక్సిల్స్ ఉంటాయనుకుంటే పది బోగీలకు 40 ఆక్సిల్స్ ఉన్నాయని అర్థం.

పట్టాలకు అమర్చిన డివైస్ ఆక్సిల్స్ ను లెక్కపెట్టి ఆ సమాచారాన్ని బాక్సుకు పంపిస్తుంది. ఆక్సిల్స్ ను బట్టి పట్టాలమీద ఎన్ని బోగీల రైలు ప్రయాణించిందనే సమాచారాన్ని సేకరిస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అల్యూమినియం బాక్సుకు పంపిస్తుంది. ఆ బాక్సు కూడా ఇలాంటి పనితీరే కనపరుస్తాయి. రావల్సిన బోగీలకంటే తక్కువ బోగీలు వస్తే వెంటనే సమాచారాన్ని అధికారులకు చేరవేస్తుంది.

ఏ రైలుకు ఏ బోగీ మిస్ అయిందో గుర్తించి రైలును తర్వాత స్టేషన్ లో నిలిపేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాత మిస్సయిన బోగీ ఎక్కడుందో తెలుసుకుంటారు. రైలు బండిని సేఫ్టీగా నడపడం కోసమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైలు ప్రమాదాలను గుర్తించడంలో అధికారులకు ఈ లొకేషన్ బాక్స్ ఎంతగానో సాయపడుతుంది.












Click it and Unblock the Notifications