వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సొంతఊరు పులివెందులలోనే నాటుసారా బట్టీలు; వీడియో పోస్ట్ చేసి లోకేష్ సూటిప్రశ్న

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలపై మొదలైన వివాదం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న మరణాలు కల్తీ సారా తాగడం వల్ల జరిగాయని, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కల్తీసారా ఏరులై పారుతుందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. నేడు, రేపు గ్రామస్థాయిలో రాష్ట్రంలో కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది.

జగన్ రెడ్డి.. జంగారెడ్డిగూడెం మరణాలు మీవల్లే కదా? కొడాలి నానీ, రోజాలపైనా దివ్యవాణి ధ్వజంజగన్ రెడ్డి.. జంగారెడ్డిగూడెం మరణాలు మీవల్లే కదా? కొడాలి నానీ, రోజాలపైనా దివ్యవాణి ధ్వజం

జగన్ సొంత ఊరు పులివెందులలోనే నాటుసారా బట్టీలున్నాయి : లోకేష్


ఇక ఇదే క్రమంలో తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడా నాటుసారా తయారు కావడం లేదని జగన్మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ సొంత ఊరు పులివెందులలోనే నాటుసారా బట్టీలు ఉన్నాయని, ఇక వీటికి జగన్ ఏమి సమాధానం చెప్తారు అంటూ లోకేష్ ప్రశ్నించారు.

నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా వైయస్ జగన్

నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా వైయస్ జగన్


సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన లోకేష్ నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా మీకు ఉందా వైయస్ జగన్ గారు అంటూ ప్రశ్నించారు. అబద్ధాల శ్వాసగా బ్రతికేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇదిగో మీ ఊళ్లో నాటు సారా బట్టీ. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా అడిగిన జగన్ రెడ్డి ఇప్పుడు మీ సొంత ఊరు పులివెందులలోనే నాటు సారా బట్టీలు బయటపడ్డాయి.దీనికి ఏం సమాధానం చెపుతారు? చెప్పాలని లోకేష్ నిలదీశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంది: లోకేష్

రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంది: లోకేష్


ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయి.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే ఇక రాష్ట్రంలో సారా మరణాలకి అంతు లేదు అంటూ లోకేష్ జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే లోకేష్ జంగారెడ్డి గూడెం మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో మద్యం విధానం, కల్తీ సారా మరణాలపై టీడీపీ ఆందోళనలు

ఏపీలో మద్యం విధానం, కల్తీ సారా మరణాలపై టీడీపీ ఆందోళనలు

ఇదిలా ఉంటే ప్రభుత్వ మద్యం విధానం, కల్తీసారా మరణాలపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలోను మండల కేంద్రాల్లోనూ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. టిడిపి నేతలు చేపట్టిన ఆందోళనకు పలుచోట్ల ఆంక్షలు అడ్డంకులు ఎదురయ్యాయి. కొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికే అనేక జిల్లాలలో టీడీపీ నేతలు జే బ్రాండ్స్ మద్యం నిషేధించాలని, కల్తీ నాటు సారా రహితంగా ఏపీని చెయ్యాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు.

English summary
Lokesh questioned why there are cheap liquor distilleries in Jagan hometown Pulivendula. He was incensed that jagan and asked direct questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X