లోకేష్ నా సోదరుడితో సమానం .. అనవసరపు పుకార్లు వద్దంటున్న సాధినేని యామిని
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని లోకేష్ తో క్లోజ్ గా ఉంటారని వచ్చిన ఆరోపణలపై స్పందించారు. కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు. లోకేష్ సోదర సమానుడని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, వైఎస్ జగన్ సోదరి షర్మిల, బ్రాహ్మణితో పాటు తన గురించి కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారనీ, విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. ఇలాంటి విమర్శలు చేసేవారికి సమాధానం ఇచ్చి తన విజ్ఞతను తగ్గించుకోనని స్పష్టం చేశారు.

నా కుటుంబమే నాకు ముఖ్యం .. అనవసరపు ఆరోపణలు, పుకార్లు పట్టించుకోను
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘టీడీపీలోకి యామిని వచ్చాక నారా లోకేశ్-బ్రాహ్మణి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సాధినేని యామిని లోకేశ్ బాబుతో చాలా క్లోజ్ గా ఉన్నారు' అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఆమె సోషల్ మీడియాలో పనీపాటా లేనివాళ్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు .నాకు ప్రేమగా చూసే భర్త , ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాకు పిల్లల భవిష్యత్, పిల్లల బాధ్యత, వ్యాపారంతో పాటు కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి. నేను వీటిలో తలమునకలు అయ్యాను కాబట్టి ఈ ఆరోపణలను పట్టించుకోను.నా కుటుంబ బాధ్యతలే నాకు సరిపోతాయని ఆమె పేర్కొన్నారు.

రాజకీయాల్లో బురద చల్లటం కామన్ .. అందుకే నేను వారి విజ్ఞతకే వదిలేస్తా అన్న యామిని
రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచి ఉంటుంది. చెడు కూడా ఉంటుంది. మెచ్చుకునేవారు ఉంటారు. ఇలా బురద చల్లేవారూ ఉంటారు. అన్నింటిని తెలుసుకుంటున్నాను అని ఆమె అన్నారు. నా గురించి ఏం తెలుసని వీళ్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు? అవతల లేడీ కాబట్టి ఆమెపై బురద చల్లేసి ఆమె వ్యక్తిత్వాన్ని చంపేస్తే ఆనందం వస్తుందని భావించే నెటిజన్లను నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ల ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉంటారు అని ఆమె తన స్పందన తెలియజేశారు.

లోకేష్ సోదర సమానుడు ..సోషల్ మీడియా లో పని లేనోళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోను
చంద్రబాబు ఇంటిలోపలకు యామిని బెంజ్ కారు వెళుతుందన్న విషయం నిజం కాదు అన్నారు . నా కారు ఇప్పటివరకూ ప్రజావేదిక లోపలకు వెళ్లలేదు. ఇక లోకేష్ అంటారా.. నా సోదరుడితో సమానం. మంచి కుటుంబం, ప్రేమించే భర్త, ఎదిగివచ్చిన పిల్లలు ఉన్నప్పుడు ఎవ్వరూ అలాంటి పనులు చేయరు. నాపై వస్తున్న విమర్శలను చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' అని సాధినేని యామిని స్పష్టం చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications