నేరాలు-ఘోరాల‌లో ఏపీ నంబర్ వన్; జగన్ రెడ్డి ప్ర‌తిభ‌కిది నిద‌ర్శ‌నం: లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టార్గెట్ చేశారు. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ చోటుచేసుకున్న నేరాల గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న నేరాలను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్.

మీ విధ్వంసపాలన దుష్ఫలితాలు వచ్చేశాయి జగన్ రెడ్డి

మీ విధ్వంసపాలన దుష్ఫలితాలు వచ్చేశాయి జగన్ రెడ్డి


సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో నేరాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని లోకేష్ విమర్శించారు.సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ లోకేష్ జగన్ రెడ్డి గారూ మీ విధ్వంస పాల‌న దుష్ఫ‌లితాలు వ‌చ్చేశాయి అంటూ పేర్కొన్నారు. నేరాలు-ఘోరాల‌లో గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి సాధించ‌డంలో మీరు ఏ1 అని మ‌రోసారి నిరూపించుకున్నారు అంటూ జగన్ ను టార్గెట్ చేశారు. ఆర్థిక‌నేరాల‌లో ఆరితేరి 32 సీబీఐ, ఈడీ, క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న మీ మూడేళ్ల పాల‌న‌లో ఆర్థికనేరాల కేసులు 9,273కి పెంచ‌డం మీ ప్ర‌తిభ‌కి నిద‌ర్శ‌నం అంటూ జగన్ సర్కార్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు.

దేశద్రోహం కేసుల్లోనూ మీరే నంబర్ 1

దేశద్రోహం కేసుల్లోనూ మీరే నంబర్ 1

ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌నల‌ను అతిక్ర‌మించిన కేసులు 2019లో 188 న‌మోదు అయ్యాయని పేర్కొన్న లోకేష్, మీ బ్రాండ్ డిజిట్‌ "420" కేసుల‌కి చేర్చిన మీ ఘ‌న‌తని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్బ్యూరో ఓ రికార్డుగా గుర్తించిందని పేర్కొన్నారు. 2021లో దేశ‌వ్యాప్తంగా 76 దేశ‌ద్రోహం కేసులు న‌మోదైతే..,అందులో 29 దేశ‌ద్రోహం కేసులు నమోదు చేసి మీరు నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిచారు అంటూ వైయస్ జగన్ ను లోకేష్ విమర్శించారు. అధిక‌ధ‌ర‌లు, అరాచ‌క‌పాల‌న‌, విధ్వంసం భ‌రించ‌లేక క‌డుపుమండి సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారంద‌రిపైనా జ‌గ‌న్ పీన‌ల్ కోడ్ వాడి దేశ‌ద్రోహం కేసులు బ‌నాయించారని లోకేష్ పేర్కొన్నారు.

ప్రిజ‌న‌రీ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో నేరాల్లో నెంబ‌ర్‌వ‌న్ అయ్యింది రాష్ట్రం

ప్రిజ‌న‌రీ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో నేరాల్లో నెంబ‌ర్‌వ‌న్ అయ్యింది రాష్ట్రం


విజ‌న‌రీ చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రం అభివృద్ధిలో నెంబ‌ర్ వ‌న్‌ అయితే, ప్రిజ‌న‌రీ జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో నేరాల్లో నెంబ‌ర్‌వ‌న్ అయ్యింద‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్బ్యూరో గ‌ణాంకాలు వెల్ల‌డించాయి అని లోకేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ఇక ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న నేరాలపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది.

ఏపీని హత్యలకు క్యాపిటల్ చేశారని టీడీపీ టార్గెట్

ఏపీని హత్యలకు క్యాపిటల్ చేశారని టీడీపీ టార్గెట్

జగన్ పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, ప్రతి ఎనిమిది గంటలకు మానభంగ రోజుకు రెండు నుంచి మూడు హత్యలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హత్యల క్యాపిటల్ చేశారంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపీలో వైసీపీ హయాంలో దళితులు, గిరిజనులపై నేరాలు గణనీయంగా పెరిగాయి అని మండిపడుతున్నారు. ఒక నేరగాడికి పాలనా పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రం ఏ విధంగా అవుతుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటూ విరుచుకు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+