వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ గారూ..నోటి ముందు ముద్ద తీసేస్తారా:ప‌రిశ్ర‌మ‌లు తిరుగు ముఖం: అందుకే ఓడిపోయాను: లోకేశ్ వార్‌..!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి..టీడీపీ నేత లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ట్విట్ట‌ర్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. జ‌గన్ త‌న అవ‌స‌రాల కోసం విచ్చ‌ల‌విడిగా ప్ర‌భుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నార‌ని ధ్వ‌జ మెత్తారు. ఈ మ‌ధ్య కాలంలో జ‌గ‌న్ కోసం కేటాయించి న నిధుల వివ‌రాల‌ను ప్ర‌స్తావించారు. అదే స‌మ‌యంతో తాను మంగ‌ళ‌గిరిలో ఓడిపోవ‌టానికి కార‌ణాల‌ను సైతం లోకేశ్ బ‌య‌ట పెట్టారు. ఇక నుండి కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు పార్టీ కార్యాల‌యంలో ప్ర‌తీ రోజు అందుబాటులోనే ఉంటాన‌ని లోకేశ్ స్ప‌ష్టం చేసారు.

Recommended Video

చంద్రబాబు పిటీషన్ పై కోర్టు తీర్పు వాయిదా
 విద్యార్ధుల నోటి ద‌గ్గ‌ర ముద్ద తీసెయ్యాలా..

విద్యార్ధుల నోటి ద‌గ్గ‌ర ముద్ద తీసెయ్యాలా..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన మాజీ మంత్రి లోకేశ్ ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న అవ‌స‌రాల కోసం ప్ర‌భుత్వ సొమ్మును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి త‌న రాజ భ‌వ‌నం ముందు ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు... ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న జ‌గ‌న్‌ గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం అంటూ ట్వీట్ చేసారు. పొదుపు చేసుకోవాలంటే రెండు ల‌క్ష‌ల మంది పేద విద్యార్దుల నోటీ ద‌గ్గ‌ర ముద్ద‌నే తీసెయ్యాలా అని ప్ర‌శ్నించారు. కొద్ది రోజులుగా లోకేశ్ ఎక్క‌డా మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌కుండా కేవ‌లం ట్విట్ట‌ర్ ద్వారా మాత్ర‌మే ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తున్నారు.

అందుకే మంగ‌ళ‌గిరిలో ఓడిపోయాను..

అందుకే మంగ‌ళ‌గిరిలో ఓడిపోయాను..

టీడీపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఇక నుండి కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని లోకేశ్ నిర్ణ‌యించారు. పార్టీ ఆఫీసులో లోకేశ్ మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు.మంగళగిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు సరిపడా సమయం లేకే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు. తాము మౌళిక స‌దుపాయాలు అభివృద్ది చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట‌మి పాల‌వ్వ‌టం ఆవేద‌న మిగిల్చింద‌న్నారు. ఓడిపోయినా ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తూ ప్ర‌భుత్వం పైన పోరాటం చేస్తా మ‌ని స్ప‌ష్టం చేసారు. కేవ‌లం నెల రోజుల స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పడ‌గానే ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోగొట్టుకున్నామ‌ని వారి కుటుంబాల‌కు అండ‌గా నిలుస్తామ‌న్నారు. కొత్త ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల స‌మ‌యం ఇద్దామ‌ని భావించినా.. ప్రభుత్వ పొరపాట్లు, ప్రజల ఇబ్బందులు చూస్తే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందన్నారు.
ఐటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇపుడు వెనకడుగు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేశ్ నేరుగా మాట్లాడ‌లేరా..

లోకేశ్ నేరుగా మాట్లాడ‌లేరా..

మాజీ మంత్రి లోకేశ్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు చేయాలంటే మీడియా స‌మావేశంలో చెప్ప‌లేరా అని వైసీపీ మంత్రు లు ప్ర‌శ్నిస్తున్నారు. నేరుగా మాట్లాడితే దొరికి పోతాన‌నే భ‌యంతోనే ట్వీట్లు చేస్తున్నార‌ని ఆరోపించారు. అది కూడా ట్వీట్లు ఎవ‌రితోనే పెట్టుస్తున్నార‌నే అనుమానం వ్య‌క్తం చేసారు. కానీ, చంద్ర‌బాబు కుటుంబం విదేశీ ప‌ర్య‌ట‌న త‌రువాత లోకేశ్ ట్వీట్ల ద్వారా ఈ విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ప్ర‌తిప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం పైన నేరుగా ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు. కానీ, టీడీపీ నేత‌లు మాత్రం ఇప్పుడు ట్విట్ట‌ర్ ద్వారానే వైసీపీ ప్ర‌భుత్వా న్ని కార్న‌ర్ చేస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ప‌దునెక్కే అవకాశం ఉంది.

English summary
TDP leader Lokesh serious comments on CM Jagan by twitter. Lokesh says CM Jagan using public money for personal use. He decided to available in TDP state office every day for cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X