Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ మోసపురెడ్డి బాదుడే బాదుడు; డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలపెంపుపై లోకేష్ మండిపాటు

నిత్యం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాదుడే బాదుడు కొనసాగుతుందని నిప్పులు చెరిగారు. ఆర్టీసీ రూపురేఖలు మారుతాయని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ సంస్థ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నారని, చార్జీల బాదుడుతో ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.

జగన్ బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు

జగన్ బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు

జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు అని పేర్కొన్న లోకేష్, ఇటీవలే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారని, మళ్లీ రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమే అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు అనే లోకేష్ పేర్కొన్నారు.

ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేస్తుంది

ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేస్తుంది


ఇక రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి వైసిపి ప్రభుత్వం కొట్టేయాలని చూస్తుంది అని లోకేష్ విమర్శించారు. వైసిపి సర్కార్ ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణం అంటూ లోకేష్ మండిపడ్డారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని లోకేష్ డిమాండ్ చేశారు. విపరీతంగా పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

Recommended Video

    పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
    ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు జగన్

    ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు జగన్

    ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. అంతేకాదు వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ జనమైతే, చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు . అవగాహన లేకే సిపిఎస్ రద్దు హామీ ఇచ్చారన్నారు. జీపిఎఫ్ డబ్బులు మాయం చేసి సాఫ్ట్ వేర్ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు . నిధులు లేకే సచివాలయ ఉద్యోగులకు వసతి సదుపాయం రద్దు చేశామని చెప్తున్నారని లోకేష్ పేర్కొన్నారు .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+