జ‌గ‌న్ అందులో మీకు మీరే సాటి: నీ అవినీతి పుట్ట ప‌గిలే టైం వ‌చ్చింది: లోకేశ్‌..సాయిరెడ్డి ట్విట్ట‌ర్

టీడీపీ నేత లోకేశ్ ట్విట్ట‌ర్ ద్వారా వైసీపీ మీద ఆరోప‌ణ‌లు కొన‌సాగిస్తున్నారు. అవినీతి కేసుల విచార‌ణ బాధ్య‌త‌లు అక్ర‌మార్కుల‌కు అప్ప‌గించ‌టం పైన ఆయ‌న ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి సైతం ట్విట్ట‌ర్ ద్వారానే స్పందించారు. ప్రజావేదిక నిర్మాణం పైనా...ఎల్లో మీడియా మీద కామెంట్స్ చేసిన సాయిరెడ్డి ఈ సారి దేవినేని ఉమాకు హెచ్చరిక చేసారు. నీ అవినీతి పుట్ట ప‌గిలే టైం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు.

నిజాయితీకే సిగ్గుచేటు అనే విధంగా..

నిజాయితీకే సిగ్గుచేటు అనే విధంగా..

టీడీపీ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అక్ర‌మాల పైన మంత్రివ‌ర్గ ఉప సంఘం ఏర్పాటు నిర్ణ‌యం పైన లోకేశ్ మ‌రో సారి స్పందించారు. అవినీతి కేసుల విచారణ కమిటీ బాధత్యలు అక్రమార్కులకు అప్పగించడమేంటని ప్రశ్నించారు.
నిజాయితీకే సిగ్గుచేటు అనే విధంగా అక్ర‌మాస్తుల కేసులో ఏ-1 అవినీతి పైన క‌మిటీ వేసారు. ఏ-2 విజ‌య సాయిరెడ్డి విచార‌ణ చేస్తార‌ట‌..క‌లికాలం కాక‌పోతే అక్ర‌మాల విక్ర‌మార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడ‌మా అంటూ ట్వీట్ చేసారు. వైఎస్ హ‌యాంలో సోలార్ విద్యుత్‌ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హ‌యాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ తండ్రి నిర్వాకంతో డిస్కంల‌కు రూ. 8 వేల‌కోట్లు న‌ష్టం వ‌చ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవ‌రు మ‌హామేతో! ఎవ‌రు దార్శ‌నిక నేతో తెలుసుకోడానికీ అంటూ కొన‌సాగించారు.

జ‌గ‌న్ మీకు మేరే సాటి..

జ‌గ‌న్ మీకు మేరే సాటి..

అన్న‌య్య‌లూ.. నాకేం తెలియ‌దంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా రూ. 2,636 కోట్లు అవినీతి జ‌రిగింద‌ని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి జగన్...అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ రాజ‌కీయంగా చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుంచి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం... విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం..అని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది.'' అంటూ జగన్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు.

ఉమా..నీ అవినీతి పుట్ట ప‌గులుతోంది..

ఉమా..నీ అవినీతి పుట్ట ప‌గులుతోంది..

వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి సైతం ట్విట్ట‌ర్ ద్వారా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. అనుకూల మీడియా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ సేవ మొద‌లు పెట్టింద‌ని..మీడియా కూడా చ‌ట్టాలు చ‌ద‌వాల‌ని..చంద్ర‌బాబు నిర్మిస్తే అవి చారిత్ర‌క క‌ట్డడాల్లా క‌నిపిస్త‌న్నాయా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జా వేదిక పైనా సాయిరెడ్డి ట్వీట్ చేసారు. చంద్రబాబు ప్రభుత్వం 9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. గణేశ్ మండపా నికి ఎక్కువ, కోళ్ల షెడ్డుకు తక్కువని సోషల్ మీడియాలో యువత చెణుకులు విసురుతోంది. దాన్నికూల్చడం అనొద్దట. ఏ రేకుకు ఆ రేకు విప్పారని అనాలట...అంటూ ట్వీట్ చేసారు. మరో ట్వీట్‌లో.. ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిర పడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది కాస్త ఓపిక పట్టు... అంటూ త‌న ట్వీట్‌ ద్వారా హెచ్చ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+