• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ పార్టీ, ఫేక్ పాల‌న, ఫేక్ మాట‌లు; థూ మీ బతుకు చెడ: విరుచుకుపడ్డ లోకేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదని, జగన్ సర్కారు పాలన దెబ్బకు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడంలేదని, ఉన్న పరిశ్రమలు కూడా దుకాణం మూసేస్తున్నాయని మండిపడుతున్న నారా లోకేష్ తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్ పర్యటన ను టార్గెట్ చేశారు.

ఖాళీ కుర్చీలతో 3 వేల కోట్ల ఒప్పందం: లోకేష్ ఫైర్

ఖాళీ కుర్చీలతో 3 వేల కోట్ల ఒప్పందం: లోకేష్ ఫైర్

దుబాయ్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు .నిన్నటికి నిన్న ఖాళీ కుర్చీలు దానికి అబుదాబి వరకు వెళ్లాలా? మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటూ విమర్శనాస్త్రాలు స్పందించిన లోకేష్ మళ్లీ గురువారం నాడు ఖాళీ కుర్చీలతో 3 వేల కోట్ల ఒప్పందం అంటూ మరోమారు టార్గెట్ చేశారు.

సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు

సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు

ఎన్ని కేసులు మెడ‌కి చుట్టుకున్నా వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయ‌న మ‌నుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదిక‌గా ఖాళీకుర్చీల‌తో గౌర‌వ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు అని ఎద్దేవా చేశారు. అందులో ఒక‌టి2021 జూన్ 4న ల‌క్ష రూపాయ‌ల పెట్టుబ‌డితో రిజిస్ట‌ర్ అయిన‌ కాజిస్ ఈ మోబిలిటి ప్రవేట్ లిమిటెడ్(Causis e-mobility private limited) ఒక‌టి. ఏడాది కూడా కాని అనామ‌కులు పెట్టిన ఈ కంపెనీ రాష్ట్రంలో 3 వేల కోట్లు పెట్టుబ‌డి పెడుతుంద‌ని,ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారు అంటూ మండిపడ్డారు నారా లోకేష్.

హై ఎండ్ జాబ్స్ అంటే వాలంటీర్లే క‌దా

హై ఎండ్ జాబ్స్ అంటే వాలంటీర్లే క‌దా

పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జ‌రిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంత హై ఎండ్ అంటే వాలంటీర్లే క‌దా! అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది అంటూ లోకేష్ విమర్శించారు. ఇదే సమయంలో ఫేక్ పార్టీ, ఫేక్ పాల‌న, ఫేక్ మాట‌లు, ఫేక్ రాత‌లు, చివ‌రికి అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద కూడా ఫేక్ ఎంవోయూలు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. థూ...మీ బ‌తుకు చెడ‌ అని వైసిపి నాయకుల్ని ప్రజలు ఛీత్కరించుకోవడంలో తప్పేముంది? అని నారా లోకేష్ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ, జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. తీవ్రపదజాలంతో సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

ఏపీ పరువు అంతర్జాతీయంగా గంగలో కలిసిపోతుంది

ఏపీ పరువు అంతర్జాతీయంగా గంగలో కలిసిపోతుంది


ఇక నిన్నటికి నిన్న రాష్ట్రంలో కొనసాగుతున్న చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయి అని, వారంతా మీ ఘనతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయింది అని లోకేష్ మండిపడ్డారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఎలాగో చేతకాదని చేశారు. కనీసం ఉన్న కంపెనీలైన పోకుండా చూడండి అదే పదివేలు అంటూ లోకేష్ జగన్ సర్కార్ కు హితవు పలికారు.

English summary
Nara Lokesh targeted Twitter as a platform, as Mekapati Goutham Reddy has announced that he is bringing huge investments to Andhra Pradesh during his visit to Dubai. Fake party, fake rule, fake words slams lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X