ఏపీ గ్రూప్1 నియామకాల్లో జగన్ ప్రభుత్వ ప్రాయోజిత అక్ర‌మాలు: విచారణకు లోకేష్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థుల నుండి అసహనం వ్యక్తం అవుతుంది. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనంలో ఏది ఖచ్చితం అని ప్రభుత్వాన్ని గ్రూప్ వన్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డిజిటల్, మాన్యువల్ ఫలితాలలో వ్యత్యాసం చోటుచేసుకోవడంతో దీనిపై విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్ వన్ నియామకాల్లో సర్కారు వారి పాట ఎంత?

గ్రూప్ వన్ నియామకాల్లో సర్కారు వారి పాట ఎంత?


తెలుగు మాధ్యమం విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు వైసీపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏపీపీఎస్సీ తీరుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రూప్ వన్ పరీక్షలు మూల్యాంకనం లో చోటుచేసుకున్న అవకతవకలను టార్గెట్ చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గ్రూప్ వన్ నియామకాల్లో సర్కారు వారి పాట ఎంత అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.

సీబీఐ,ఈడీ కేసుల నిందితుడు జగన్ రెడ్డి నిర్వహణలో గ్రూప్1 లోనూ అవకతవకలు

సీబీఐ,ఈడీ కేసుల నిందితుడు జగన్ రెడ్డి నిర్వహణలో గ్రూప్1 లోనూ అవకతవకలు


ముప్ప‌యికి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్న సిఎం జ‌గ‌న్‌రెడ్డి నిర్వ‌హ‌ణ‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవ‌క‌త‌వ‌క‌లతోనే సాగిందని లోకేష్ పేర్కొన్నారు. జగన్ సర్కార్ అక్రమాలకు బాధ్యత వహించాలని లోకేష్ అంటున్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా డిజిటల్ మూల్యాంకనం చేశామ‌ని గౌర‌వ కోర్టుకి జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు నివేదించింది అని తెలిపిన లోకేష్, పారదర్శకత ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మ్యాన్యువల్ వాల్యుయేషన్ లో ఎంపిక కావడం వెనుక మతలబు ఏంటో జగన్ ప్రభుత్వం స్పష్టం చేయాలని లోకేష్ ప్రశ్నించారు.

అక్రమాలపై గవర్నర్ దృష్టి సారించాలి

అక్రమాలపై గవర్నర్ దృష్టి సారించాలి


డిజిట‌ల్‌లో మాయాజాలం జ‌రిగిందా? మాన్యువ‌ల్‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకున్నాయా? అనేది ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాలని లోకేష్ ప్రశ్నించారు. గ్రూప్‌1 ఇంట‌ర్వ్యూ ఎంపిక‌ల్లో స‌ర్కారు ప్రాయోజిత అక్ర‌మాల‌పై గ‌వ‌ర్న‌ర్ దృష్టి సారించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. నిష్పాక్షిక‌మైన న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలని డిమాండ్ చేశారు. అర్హులై ఉండి కూడా ఎంపిక‌కాని అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాలని లోకేష్ పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదివిన అర్హులకు న్యాయం చేసేదాకా పోరాటం సాగిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+