యువతిని నగ్నంగా వీడియో తీసి..: ప్రియుడి ఇంటిముందు ధర్నా

విజయవాడ: ఏపీలోని విజయవాడలో ఓ యువతిని నగ్నంగా చిత్రీకరించి, బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు తెలియకుండా నిందితుడు రవి ఓ యువతిని నగ్నంగా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

శాంతి అనే యువతి తన ప్రియుడు నవీన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన అనంతపురంలో జరిగింది. తామిద్దరం ఏడేళ్లుగా ప్రేమించికుంటున్నామని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. తామిద్దరం ఎంబీఏలో క్లాస్‌మేట్స్‌ అని, 2009 నుంచి తాము ప్రేమించుకుంటున్నామని తెలిపింది.

Lover cheats a girl, Woman stages dharna in front of lovers house

పెళ్లి చేసుకోమని చెబుతుంటే అతను ఏవేవో చెబుతూ తప్పించుకుంటున్నాడని తెలిపింది. అతడి తీరుకు విసిగిపోవడంతో మహిళా సంఘాలతో కలిసి నవీన్‌ ఇంటి వద్ద ఈరోజు ఆందోళనకు దిగింది. విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. నవీన్ అంగీకరించలేదు. పైగా, బలవంతం చేస్తే తాళి కట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

మహిళతో అనుచిత ప్రవర్తన, వ్యక్తిపై కేసు

కృష్ణా జిల్లా గంపలగూడెంలో ఓ వివాహితతో అనుచితంగా ప్రవర్తించిన మారేశు అనే వ్యక్తి పైన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితుడు తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+