ప్రమాదం: మాజీ మంత్రి బాలరాజుకు గాయాలు(పిక్చర్స్)
విశాఖపట్నం: జిల్లాలోని నర్సీపట్నం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గాయపడ్డారు. బాలరాజు ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలరాజుతో పాటు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ వర్మ గాయపడ్డారు.
వెంటనే వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాలరాజు తనకు మంచిమిత్రుడని, ప్రమాదవార్త తెలిసిన వెంటనే వచ్చి పరామర్శించానని తెలిపారు. గంటా వెంట అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు, అమలాపురం ఎంపి ఉన్నారు.
ఆ తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పరామర్శించారు. బాలరాజు గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రమాదం
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గాయపడ్డారు.

ప్రమాదం
బాలరాజు ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం
ఈ ప్రమాద ఘటనలో బాలరాజుతో పాటు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ వర్మ గాయపడ్డారు.

ప్రమాదం
వెంటనే వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు.

ప్రమాదం
డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ప్రమాదం
కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు.

ప్రమాదం
బాలరాజు ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలరాజుతో పాటు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ వర్మ గాయపడ్డారు.












Click it and Unblock the Notifications