Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏపీలో తిరుమల, బెజవాడ దుర్గమ్మతో పాటు ప్రముఖఆలయాల మూసివేత, పునః దర్శనాలిలా!!

నేడు చంద్రగ్రహణం. 2022 చివరి చంద్ర గ్రహణం ఈరోజు ఏర్పడనుంది. ఈరోజు సాయంత్రం 5:32 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఏర్పడుతుంది. పాక్షిక దశ వ్యవధి 03 గంటలు 38 నిమిషాలు 35 సెకన్లు ఉంటుంది. చంద్ర గ్రహణం నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు మూతపడుతున్నాయి. ఇక ఏ ఆలయం ఎప్పుడు మూతపడుతుంది.. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న వివరాల విషయానికి వస్తే..

 తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, తిరిగి దర్శన కాలం ఇదే

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత, తిరిగి దర్శన కాలం ఇదే


గ్రహణాలు ఏవైనా సరే వాటి ప్రభావం ఆలయాలపై ఉంటుందని నమ్మకం. అందుకే గ్రహణాల సమయంలో ఆలయాలను మూసివేస్తారు. చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం మూసివేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలు రద్దు చేసి ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 11 గంటల పాటు ఆలయాన్ని మూసివేసే టీటీడీ రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి తిరిగి దర్శనాలకు అనుమతించనున్నారు.

బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలంలోని మల్లన్న ఆలయాలలో ఇలా..

బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలంలోని మల్లన్న ఆలయాలలో ఇలా..


విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ ఆలయాన్ని ఈరోజు ఉదయం 8 గంటల నుండి రేపటి వరకు అన్ని దర్శనాలు రద్దు చేసి మూసివేయనున్నారు. తిరిగి రేపు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం మూసి వేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల దాకా ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆపై రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తారు.

అన్నవరం, సింహాద్రి అప్పన్న ఆలయాలలో చంద్రగ్రహణం మూసివేత ఇలా

అన్నవరం, సింహాద్రి అప్పన్న ఆలయాలలో చంద్రగ్రహణం మూసివేత ఇలా


అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు మూసివేయనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ జరిగే గిరిప్రదక్షిణ కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ముగించనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా సింహాద్రి అప్పన్న ఆలయాన్ని మూసివేశారు. పూర్తిగా రోజంతా స్వామివారి ఆలయాన్ని మూసివేసి రేపు ఉదయం సుప్రభాత సేవ అనంతరం దర్శనాలు కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చంద్రగ్రహణం కారణంగా ఆలయాలను మూసివేసి, తిరిగి సాయంత్రం గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.

 తెరచి ఉండనున్న కాళహస్తి ఆలయం.. గ్రహణ కాల ప్రత్యేక పూజలు

తెరచి ఉండనున్న కాళహస్తి ఆలయం.. గ్రహణ కాల ప్రత్యేక పూజలు


ఇదిలా ఉంటే చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం భక్తులకోసం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం గ్రహణాల సమయంలో మూత పడదు. గ్రహణ సమయంలో పూజల కోసం భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+