మజ్లిస్ సపోర్ట్‌పై సోనియా ఆరా: ఎంఏ ఖాన్‌తో భేటీ

రాష్ట్ర విభజన నేపథ్యంలో మైనారిటీలకు సంబంధించిన అంశాలపై మజ్లిస్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆ పార్టీ నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం వరుసగా సంప్రదిస్తోంది. ఇందులో భాగంగానే ఎంఏ ఖాన్‌ను తన నివాసానికి పిలిపించి మరీ సోనియా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు.
మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ పార్టీ లౌకికవాద పార్టీగా కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే విషయంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగానే విభజన జరుగుతుందని, అందులో ఎలాంటి మార్పు ఉండదని ఈ సందర్భంగా సోనియా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఖాన్ కూడా ఇదే కోరినట్లు సమాచారం.
ఇక ఈ భేటీ తర్వాత హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా మజ్లిస్ ఎంపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఒకట్రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాల్సిందిగా కోరినట్లు తెలిసింది. మైనారిటీలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications