డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచాం.. పోలవరంలో అవకతవకలు వాస్తవమే: టీడీపీ ఎంపీ
పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకల మాట నిజమేనన్నారు. అయితే ఈ అవకతవకలను అధికారులు సరిద్దుతున్నారని వెల్లడించారు.
ఏలూరు: పార్టీ అధినేతతో విభేదాల గురించి స్పందిస్తూ.. టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పర్యటనలకు తాను హాజరవడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదే సమయంలో అధినేత చంద్రబాబుపై తనకెలాంటి కోపం లేదని చెప్పారు.
ఇక వేదికల మీద ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను వేదికలు ఎక్కడం లేదని మాంగటి బాబు స్పష్టం చేశారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉండటం సహజమేనని చెప్పుకొచ్చారు.

ఇక గత ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. డబ్బు ఖర్చు చేయడం ద్వారానే గెలిచామని ఆయన పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, పోలవరం భూసేకరణలో గతంలో అవకతవకల మాట నిజమేనన్నారు. అయితే ఈ అవకతవకలను అధికారులు సరిద్దుతున్నారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications