ఈసారి టీడీపీకి వచ్చే సీట్లివే..! మహానాడులో అచ్చెన్నాయుడు జోస్యం..

ఏపీలో టీడీపీ వార్షిక పండుగ మహానాడు రాజమహేంద్రవరంలో అట్టహాసంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహానాడులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన అచ్చెన్నాయుడు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించబోతోందని జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లను గెల్చుకోవడం ఖాయమని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయం చెబుతూ వస్తున్న అచ్చెన్నాయుడు మరోసారి మహానాడు వేదికగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమే అని అచ్చెన్నాయుడు తెలిపారు.

 achamnaidumahanadumeet

ఈ సందర్భంగా వైసీపీ పాలనపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారని అచ్చెన్న పేర్కొన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాంతో సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఆయన గుర్తుచేశారు. కాకపోతే చేసిన పనులను చెప్పుకోలేకపోయామన్నారు. అప్పట్లో తెలుగుదేశాన్ని ఎదుర్కోలేకే జగన్ కోడి కత్తి డ్రామా, సొంత బాబాయ్‌ని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జగన్‌ను వేటాడి, వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 151 స్థానాలతోనే జగన్ కళ్లు నెత్తికెక్కి ఒళ్లు మదమెక్కిందని అచ్చెన్న ఫైర్ అయ్యారు.

1982 నుంచి 2019వరకు రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి ఇబ్బందిలేదని, 2019లో దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమరపాటుతో తప్పుచేసి, రాష్ట్రానికి తీరని అన్యాయంచేశారన్నారు. ఓ కొత్త వ్యక్తి రాజకీయపార్టీ పెట్టి సేవచేస్తానంటే నమ్మడంలో అర్థముందని, కానీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లుదోపిడీచేసి, 11కేసుల్లో ముద్దాయిగాఉండి, 16 నెలలుజైల్లో ఉండివచ్చిన ఒకదోపిడీ దొంగకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయడం చాలాపెద్ద తప్పు అని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

 cbnmahanadu

ఒకవైపు 5కోట్లమంది ప్రజల వ్యతిరేకత, మరోవైపు తరుముకొస్తున్న బాబాయ్ హత్యకేసుతో జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టడంలేదని అచ్చెన్న తెలిపారు.రేపోమాపో బాబాయ్ హత్యవ్యవహారం జగన్ మెడకు చుట్టుకోనుందన్నారు. తాము ఎప్పుడో చెప్పామని, అదే నిన్నసీబీఐ కోర్టులోచెప్పిందన్నారు. ప్రపంచానికి వివేకామరణవార్త తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిగా తెలిసిందని సీబీఐ న్యాయస్థానంలో చెప్పిందన్నారు. సీబీఐ అడుగుముందుకేస్తే తనకథ ముగుస్తుందన్న ఆందోళన ముఖ్యమంత్రికి నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తోందన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+