కాసేపట్లో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు-మహా గవర్నర్ సహా పలువురి నివాళి..!
నిన్న అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు చేరుకున్న రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ఇవాళ పలువురు మంత్రులు, వీఐపీలు సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. సీఎం చంద్రబాబు అక్కడే ఉండి వారిని రిసీవ్ చేసుకుంటున్నారు.
నారా రామ్మూర్తి నాయుడికి ఇవాళ మధ్యాహ్నం నారావారిపల్లెలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సినీ నటుడు మోహన్ బాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీతో పాటు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు రామ్మూర్తి నాయుడు పార్ధివ దేహాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న చంద్రబాబుతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా రామ్మూర్తి నాయుడు సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు.

నారావారిపల్లెలో గతంలో రామ్మూర్తి నాయుడు తల్లితండ్రుల అంతిమ సంస్కారాలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇంటి నంచి అంతిమయాత్రగా భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇప్పటికే పలువురు వీఐపీలు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications