‘ఇది మహేశ్ బాబు బస్టాప్’: ధన్యవాదాలు తెలిపిన నమ్రత
హైదరాబాద్/గుంటూరు: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలో ఇటీవల ఓ కొత్త బస్టాప్‌ను నిర్మించారు. అయితే బస్టాండ్ మొత్తాన్ని మహేశ్ నటించిన 'స్పైడర్' సినిమా పోస్టర్లతో నింపేయడం విశేషం.
నమ్రత ఇలా..
కాగా, ఆ బస్టాప్ ఫొటోను మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘గ్రామం' ఫౌండేషన్ తరఫున బుర్రిపాలెంలో కొత్తగా కట్టించిన బస్టాప్. సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేసిన వారందరికీ ధన్యవాదాలు' అని నమ్రత పేర్కొన్నారు.

సినిమానే స్ఫూర్తి..
‘శ్రీమంతుడు' సినిమాలో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపటడ్డం తెలిసిందే. ఈ సినిమానే ఆదర్శంగా తీసుకున్న మహేశ్.. ఏపీలోని బుర్రిపాలెంతోపాటు తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తతీసుకున్నారు.

అన్నితానై నమ్రత..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు దత్తత గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు వేగంగానే జరుగుతున్నాయి. మహేశ్ బాబు ఎక్కువగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో నమ్రతనే అన్ని తానై పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని సిద్ధాపూర్‌లోఆమె పర్యటించారు.

రంగంలోకి ప్రముఖులు..
మహేశ్ బాబుతోపాటు చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతుండటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశంలోని ప్రతీ ఎంపీ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications