నిఘా చీఫ్‌గా మహేశ్‌చంద్ర లడ్డా-చంద్రబాబు ఏరి కోరి..!!

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా ముఖ్య నియామకాలు పూర్తి చేస్తున్నారు. తాజాగా పాలనలో కీలకమైన నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాను నియమించారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో జాయిన్ అయిన లడ్డాను ఇంటెలిజెన్స్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ఏరి కోరి నిఘా చీఫ్ గా లడ్డాను ఎంపిక చేసారు.

నిఘా చీఫ్ గా లడ్డా
నిఘా విభాగం చీఫ్‌గా 1998 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన్ను రాష్ట్రప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏపీకి పంపించింది. ఆయన్ను నిఘా అదనపు డీజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు, చెవులైన కీలక నిఘా విభాగంలో నిజాయితీపరుడు, సమర్థుడైన లడ్డాను నియమిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Mahesh Chandra Laddha posted as Intelligence ADG Orders issued

లడ్డా ట్రాక్ రికార్డు
మహేష్ చంద్రలడ్డా రాజస్థాన్ కు చెందిన వారు. ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగానూ పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో 2005 ఏప్రిల్ 27న మావోయిస్టులు మహేశ్ చంద్రలడ్డాపై దాడికి చేశారు. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మావోయిస్టుల అణచివేతలో కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగింది.ఆ తరువాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. గుంటూరులోనూ నక్సల్స్ వేరివేతతో పాటు.. రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించారు.

చంద్రబాబు ఏరి కోరి
లడ్డా విజయవాడ డిప్యూటీ కమిషనర్ గానూ పనిచేసారు. విశాఖపట్టణం కమిషనర్ గానూ పనిచేశారు. 2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మహేష్ చంద్రలడ్డా ఉన్నారు. ఆ తరువాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. కొత్త ప్రభుత్వం సూచన మేరకు ప్రస్తుతం మళ్లీ ఏపీ సర్వీసులోకి తిరిగివచ్చారు. లడ్డా సమర్ధత పైన నమ్మకం ఉంచిన చంద్రబాబు ఏరికోరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రప్పించటంతో పాటుగా కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+