పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా వెంట పడ్డారు, ఖాళీ పాత్రలే..: మహేష్ కత్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు, మహేష్ కత్తికి మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో ముగిసేట్లు లేదు. తాను 16వ తేదీ వరకు మౌనంగా ఉంటానని ఆయన ప్రకటించారు.

ఆ మేరకు పవన్ కల్యాణ్ అభిమానులపై ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు కూడా చేయడం లేద. అయితే, పవన్ కల్యాణ్ అభిమానులు తనను వదలడం లేదని మహేష్ కత్తి అన్నారు.

 నేను ఉరేళ్తుంటే..

నేను ఉరేళ్తుంటే..

సంక్రాంతి పండుగకు తను ఊరు వెళ్తుంటే తనను పవన్ కల్యాణ్ అభిమానులు ఫాలో ఆయ్యారని కత్తి మహేష్ ట్విట్టర్ ద్వారా చెప్పారు. తాను ఊరు చేరుకున్నానని, తాను కారులో తమ ఊరికి వస్తుంటే తన కారును ఫాలో ఆయ్యారని మహేష్ కత్త చెప్పారు.

  Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !
  ఊరికి వస్తున్న

  ఊరికి వస్తున్న

  తాను ఊరికి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జై వన్ కల్యాణ్ అని అరుస్తూ బైకులపై తన కారును ఫాలో అయినట్లు మహేష్ కత్తి తెలిపారు. తిరుపతి, విజయవాడ, మదనలప్లి, పుత్తూరు తదితర పట్టణాలకు చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు తమ గ్రామానికి వచ్చి వెళ్లినట్లు తెలిసిందని ఆయన అన్నారు.

   ఖాళీ పాత్రలే ఎక్కువగా...

  ఖాళీ పాత్రలే ఎక్కువగా...

  ఖాళీ పాత్రలే ఎక్కువగా శబ్దం చేస్తాయని మహేష్ కత్తి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. వాస్తవాల కోసం జనవరి 16వ తేదీ వరకు ఆగండని చెప్పారు. సంక్తాంత్రికి విడుదలైన అజ్ఢాతవాసి జై సింహా సినిమాలపై తనదైన శైలిలో ఆయన సమీక్షలు రాశారు.

   కోన వెంకట్ అలా చెప్పడంతో..

  కోన వెంకట్ అలా చెప్పడంతో..

  ఈ నెల 15వ తేదీ వరకు సైలెంట్‌గా ఉండాలని మహేష్ కత్తికి కోన వెంకట్ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ప్రస్తుతం నేరగా పవన్ కల్యాణ్ అభిమానులపై ఏ విధమైన వ్యాఖ్యలు కూడా చేయడం లేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Cine critic Mahesh Kathi tweeted that Pawan Kalyan fans had followed him, while he was going to his native village.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి