ప్యాకేజీ తీసుకుంటున్నారా, లెక్కేంటి?: పవన్‌పై మహేష్ కత్తి కొత్త డౌట్లు ఎన్నో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి విరుచుకుపడ్డారు. పదేపదే ఆయన జనసేనానిని టార్గెట్ చేయడం వెనుక ఆయన ఇంటెన్సిటీ ఇట్టే అర్థమవుతోందని అంటున్నారు. అయినప్పటికీ ఆయన పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

చదవండి: తోడుదొంగలు గేమ్ బాగా ఆడుతున్నారు: పవన్-బాబులపై కత్తి మహేష్ సంచలనం, 'అంత మాటా!'

అంటే కావాలనే, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే నిత్యం మీడియాలో నానవచ్చునని ఆయన భావిస్తున్నట్లుగా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చిన్నపాటి వీడియో పోస్ట్ లింక్ పెట్టారు.

చదవండి: మమ్మల్ని లెక్క చేయరు, చేతులు ఎత్తాలి: మోడీపై జేసీ దివాకర్ రెడ్డి

పవన్ కన్ప్యూజన్ నాకూ కన్ఫ్యూజనే

పవన్ కన్ప్యూజన్ నాకూ కన్ఫ్యూజనే

అతను పెట్టిన లింక్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఆస్తుల పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో ఆయన 'పవన్ కళ్యాణ్‌కు ఇప్పటి వరకు రాజకీయ అవగాహన మాత్రమే లేదు అని అనుకుంటుండేవాడిని. తన స్టెట్‌మెంట్లు కనుక చూస్తే బహుశా తను ఒకసారి చెప్పింది ఇంకోసారి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్‌లో ఉన్నాడనేది నాకు కూడా కన్ఫ్యూజన్‌గా ఉంది' అన్నారు.

పవన్ కళ్యాణ్ బీద అరుపులు

పవన్ కళ్యాణ్ బీద అరుపులు

కత్తి మహేష్ ఇంకా మాట్లాడుతూ.. 'కానీ ఇప్పుడు కొత్తగా నిజానికి అతనికి ఆర్థికపరమైనటువంటి అవగాహన లేదు. ముఖ్యంగా తన స్వంత ఆర్థిక పరిస్థితి పట్ల అస్సలు అవగాహన లేదని మనకు కనిపిస్తోంది. ఓ వైపు అసలు నా వద్ద డబ్బులు ఎక్కడివి అని బీద అరుపులు అరుస్తుంటారు. ఇంకో దగ్గరకు వెళ్లి ప్రేక్షకులతో.. నా సినిమా ఆడిస్తేనే కదా నాకు డబ్బులు వస్తాయి అని అంటాడు' అని పేర్కొన్నారు.

పవన్ వద్ద డబ్బులున్నట్లా, లేనట్లా, సినిమాకు ఎంత

పవన్ వద్ద డబ్బులున్నట్లా, లేనట్లా, సినిమాకు ఎంత

మహేష్ ఇంకా మాట్లాడుతూ.. 'తర్వాత రీసెంటుగా చూసుకుంటే ఫోర్బ్స్ మేగజైన్‌లో రిచ్చెస్ట్ ఇండియన్స్‌లో జరిపిన సర్వేలో పవన్ కూడా ఓ రిచ్చెస్ట్ పర్సన్. అంటే డబ్బులు ఉన్నట్లా లేనట్లా. ప్రతి సినిమాకు ఎంత తీసుకుంటున్నారు. ట్యాక్స్ కడుతున్నారా' అని ప్రశ్నించారు.

ప్యాకేజీ తీసుకుంటున్నారా, లెక్కేమిటి

ప్యాకేజీ తీసుకుంటున్నారా, లెక్కేమిటి

కత్తి మహేష్ ఇదే సమయంలో ప్యాకేజీలు తీసుకుంటున్నారా అని కూడా ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. 'లోపాయకారిగా ఇంకా ఎవరో ఇస్తున్న ప్యాకేజీలు కూడా తీసుకుంటున్నారా, వాటికి ఉన్న లెక్కలు ఏమిటి, ఇవేవీ తనకు కూడా అవగాహన ఉన్నట్లుగా లేదు' అన్నారు.

పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి

పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి

ఇంతవరకు పవన్‌పై తనకు రాజకీయంగా ఉన్న సందేహం, ఇప్పుడు అతని ఆర్థిక పరిస్థితి పట్ల, అతని ఆర్థిక అవగాహన పట్ల, తనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పట్ల తనకు కూడా డౌట్ వచ్చేలా ఉందని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. ఏమో ఈ అనుమానాలు ఎంత వరకు నిజమో తెలియదు అన్నారు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్‌లో ఏ సమాచారం అందుబాటులో లేదన్నారు.

ఈ డౌట్ నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, ఎదురు చూస్తా

ఈ డౌట్ నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, ఎదురు చూస్తా

పవన్ కళ్యాణ్ విషయంలో ఇవన్నీ అనుమానాలుగానే ఉంటాయా? లేదా నిజంగా ఈ అనుమానాల నుంచి కొన్ని రాజకీయ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, అనే విషయాలపై ఎదురు చూడాల్సిందే అన్నారు. నేను కూడా దాని కోసం ఎదురు చూస్తూ ఉంటానని కత్తి మహేష్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahesh Kathi shcking comments on Jana Sena chief Pawan Kalyan properties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి