శ్రీవారి దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్పాట్ డెడ్, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తూ ఐదుగురు మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది. కారు కంటైనర్ క్రిందకు దూసుకుపోయిన ఘటనలో అయిదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, నేండ్రకుంట సమీపంలోని, కోనప్ప రెడ్డిపల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే ఈ రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

major road accident in tirupati district 5 died 2 injured cm chandrababu orders to officials

ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరిన ఏడుగురు వ్యక్తులు పాకాల వద్ద ఒక కారును ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందకి దూసుకు వెళ్లారని ప్రాధమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఒక వృద్ధుడిని, ఒక చిన్నారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి
ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.ఇక తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పైన సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సిఎం ఆదేశించారు.

చంద్రబాబు కీలక ఆదేశం
క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సిఎం ఆదేశాలతో రోడ్డుప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్థన్ రాజులు పరిశీలించారు.కలెక్టర్, ఎస్పీ ప్రమాదం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+