వైసిపిలో చేరిన మల్లాది విష్ణు: ఇదీ చంద్రబాబు దారి అని జగన్

మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. విష్ణుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు.

విజయవాడ: మల్లాది విష్ణు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. విష్ణుతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు.

పార్టీ కండువా కప్పి జగన్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. మల్లాది విష్ణు వైసిపిలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ఇదీ చంద్రబాబు దారి

చంద్రబాబు దారి అవినీతిదారి అన్నారు. ఆయన సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని ఆరోపించారు. రాజకీయం కోసం ఆయన ఏమైనా చేస్తారన్నారు. చంద్రబాబు దారి పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి కనిపిస్తుందన్నారు.

Malladi Vishnu joins YSR Congress

ఆయన దారిలో రైతులను మోసం చేసిన విషయాలు కనిపిస్తాయని, ఇచ్చిన హామీలు నెరవేర్చని దుర్మార్గం కనిపిస్తాయన్నారు. ప్రతి ఒక్కరిని వంచించిన మనస్తత్వం చంద్రబాబు దారిలో కనిపిస్తుందన్నారు.

ప్రజలను కాకుండా పోలీసులను నమ్ముకోవడం చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుందని, ఒకే అబద్దాన్ని వందసార్లు చెప్పి.. అదే నిజమని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు దారిలో కనిపిస్తుందన్నారు.

ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచీ దాకా, చివరకు గుడి భూములను కూడా వదలకుండా, జెన్ కో కాంట్రాక్టుల దాకా, రాజధాని భూముల దాకా కుంభకోణాలు ఆయన దారిలో కనిపిస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+