హిందూ సమాజానికి మల్లాది విష్ణు బహిరంగ క్షమాపణ చెప్పాలి... బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్...
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు.రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గణేశ్ ఉత్సవాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ చిత్తూరు జిల్లా ఐరాల ఎస్సై విడుదల చేసిన నోటీసులను ఓ టీవీ చానెల్ డిబేట్‌లో తాను చూపిస్తే... మల్లాది విష్ణు తమ పైనే తప్పుడు ఆరోపణలు చేశారని విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. ఆ నోటీసులు బీజేపీ నేతలే ఎక్కడో తయారుచేసి ఉంటారని ఆరోపించినట్లు చెప్పారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారన్నారు.

తీరా ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చిన ఎస్సైని సస్పెండ్ చేశారని... గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించినందుకే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారని పేర్కొన్నారు. నోటీసులు బీజేపీ నేతలే తయారుచేశారన్న మల్లాది విష్ణు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాము నిజాలు మాట్లాడితే తప్పని చెప్పి, తమపై బెదిరింపులకు దిగిన మల్లాది విష్ణు యావత్ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ వ్యతిరేకులైన మీకు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు.
అంతకుముందు,మంత్రి కొడాలి నాని ఇదే విషయంపై మాట్లాడుతూ... వినాయక చవితి ఉత్సవాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఏపీలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఇక్కడ కూడా అవే అమలు చేస్తున్నామని అన్నారు. దేవుడి పేరుతో బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.వినాయక చవితి పందిర్ల వద్ద ఉండే జనంలో 10 శాతం కూడా బీజేపీ దగ్గర ఉండరని, ఏపీలో బీజేపీ గురించి, సోము వీర్రాజు గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ శవాలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితికి ఎందుకు అనుమతినవ్వరంటున్న చంద్రబాబు... థర్డ్ వేవ్ విజృంభిస్తే ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.కరోనాతో ప్రజలకి ఇబ్బంది తలెత్తితే... దాన్ని కూడా రాజకీయం చేయడం కోసమే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారని మండిపడ్డారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications