అనుమానం: భార్యను కొట్టిచంపిన భర్త, కిరోసిన్ పోసి..

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ పట్టణానికి చెందిన నీతూ(25), మనోజ్‌లకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం వీరు నెల్లూరులోని గూడూరు పట్టణానికి వచ్చారు.
చిన్నమసీదు వీధిలో ఆరు నెలలుగా నివాసముంటున్నారు. నీతూపై అనుమానం పెంచుకున్న మనోజ్‌కుమార్ గురువారం అర్ధరాత్రి తీవ్రంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు.
తిరుమలలో భక్తుడి ఆత్మహత్య
తిరుమల: తిరుమలలో ఓ భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపవినాశనం సమీపంలో నందకం అతిథి గృహం దగ్గర టీటీడీ ఉచిత బస్సుకింద పడి భక్తుడు చనిపోయాడు. బస్సు వెనుక టైరు కింద భక్తుడు తల పెట్టడంతో మొహం గుర్తించలేని విధంగా ఉంది. అయితే శుక్రవారం ఉదయం నుంచే అతడు పలు వాహనాల కింద పడి చనిపోయేందుకు ప్రయత్నించాడని విజిలెన్స్ అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications