టైర్లు కప్పి యువకుడిని దహనం చేశారు

ట్రాన్స్ ఫార్మర్ సమీపంలోని చెత్తకుండి వద్ద పాత టైర్లను కప్పి యువకుడిని దహనం చేశారు. చుట్టూ నివాస స్థలాలు, దుకాణాలు ఉన్నప్పటికీ చలి మంట వేసుకున్నారులే అని అంతా అనుకున్నారు.
ఆ తర్వాత వాసన, అస్థిపంజరం కనిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి మంగళగిరి డీఎస్పీతోపాటు ఇతర సిబ్బంది చేరుకుని పరిశీలించారు.
భీమవరంలో బీహార్ దొంగల బీభత్సం:
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీహార్ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో గుడికి వెళ్లి వస్తున్న ఓ మహిళ మెడలోని చైన్‌ను తస్కరించిన దొంగలు పారిపోయే క్రమంలో హల్ చల్ చేశారు. దొంగల దాడిని గమనించిన స్థానికులు వారిని వెంబడించారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు కూడా దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు బీహారీ దొంగలు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులకు దిగిన దొంగల్లో ఒకడిని భీమవరం కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు చాకచక్యంగా పట్టుకుని బంధించారు.
అనంతరం స్థానికుల సహకారంతో మిగిలిన ఇద్దరు బీహారీ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications