వ్యాపారిని బైక్‌తో సహా తగులబెట్టారు, సింహాచలం కొండపై అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని యలమంచిలి మండలం లాలంపొడూరులో వ్యాపారిని గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. అనంతరం మృతదేహం ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఉండేందుకు
బైక్‌తో సహా పెట్రోల్ పోసి తగులబెట్టారు.

ఈ సంఘటన లాలంపొడూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని అంటున్నారు.

సింహాచలం కొండపై భారీ అగ్ని ప్రమాదం

Man Brutally Murdered at Visakhapatnam

సింహాచలం కొండపై శుక్రవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 10 దుకాణాలు దగ్ధమయ్యాయి. ముందు సింహగిరి మార్కెట్లో ఉన్న ఓ దుకాణంలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్రమేపి సమీపంలోని దుకాణాలకు అంటుకున్నాయి.

అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సుమారు రూ.50లక్షలు ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

దేవాదాయశాఖ అధికారులు వచ్చి అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ఆరంభించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+