షాకింగ్: తమ్ముడి భార్యను తన భార్యగా చూపి ఆస్తి కాజేశాడు

నెల్లూరు: మరదలిని భార్యగా చూపించి, భర్త ఆస్తిని కాజేసిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. మరదలిగా చూపించిన వ్యక్తి తమ్ముడి భార్య కావడం గమనార్హం. ఆమెను చూపించి భార్య పైన ఉన్న రూ.3 కోట్ల ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేసుకున్నాడు.

ఈ విషయం తెలియడంతో భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారించారు. సూళ్లూరుపేట ప్రసాద్‌క ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రసాద్‌కు శ్రీకాళహస్తిలో కుమార్తె పేరు పైన ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అది రూ.3 కోట్ల విలువ చేస్తుంది.

ఇదిలా ఉండగా, రవికి, భార్య మమతకు మనస్పర్థలు వచ్చాయి. ఆమె భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. తండ్రి మృతి అనంతరం, మమత తన చెల్లెలి పెళ్లి చేసేందుకు తన పేరిట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అమ్మాలని భావించింది. అయితే, అది తన భర్త పేరిట ఉండటంతో, షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man cheats wife for property

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. రవి తన తమ్ముడి భార్యను తన భార్యగా పేర్కొని, ఆమెకు అనారోగ్యం కారణంగా ఆమె ఆస్తి అయిన కాంప్లెక్స్‌ను తన తమ్ముడి పేరిట రాయించుకున్నారు. అందుకు భార్య ఆధార్ కార్డు జత చేశారు.

ఆధార్ కార్డు ఫోటో, మరదలు ముఖం వేరుగా ఉండటంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ మొదట తమ్ముడి పేరిట, ఆ తర్వాత తమ్ముడి నుండి తన పేరిట కాంప్లెక్స్ రాసుకున్నాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+