భార్య ఆత్మహత్యతో విషం తాగి సూసైడ్ చేసుకొన్న భర్త, ఏమైందంటే?
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని నవాన్ షహర్ జిల్లాలో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకొన్న ఘటన సంచలనం కల్గించింది.భార్య ఆత్మహత్య చేసుకొందనే భయంతో భర్త విషం తాగి మృతి చెందాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
పంజాబ్‌లోని నవాన్ షహర్ జిల్లాలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. నవాన్‌షహర్‌లో భార్యాభర్తలు రికీ(27), పూనమ్ ఘాయ్ (25)లు వాల్మీకి మోహలా నవాన్‌షహర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే గురువారం నాడు భార్య పూనమ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త రికీ ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను కిందకి దించి ఆస్పత్రికి తరలించాడు.
ఆమెను పరీక్షించిన డాక్టర్లు పూనమ్ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆందోళనకు గురైన భర్త రికీ.. డబ్బులు తెచ్చి హాస్పిటల్ ఫీజు చెల్లిస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లిన రికీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రికీ రాకపోవడంతో పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు.

అయితే రికీ ఇంటికి వెళ్ళి చూసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. రికీ విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,భర్తలిద్దరూ కూడ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై స్పష్టత రాలేదు. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
భార్య, భర్తలిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయమై స్థానికులతో పాటు మృతుల కుటుంబసభ్యులను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications