హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్లో మహిళకు వేధింపు, అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ మహిళను ఫోనులో వేధిస్తున్న వ్యక్తిని అల్వాల్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండుకు రలించారు. అల్వాల్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన శివకుమార్ ఆటో డ్రైవర్. స్థానికంగా ఉండే ఓ మహిళ ఫోన్ నెంబర్ తెలుసుకొని కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు.

అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నాడు. శివకుమార్ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.

విశాఖలో మార్ఫింగ్ గ్యాంగ్

Man harassing woman by phone

విశాఖ మార్ఫింగ్‌ గ్యాంగ్‌ అత్యాచార ఘటనను కలకలం రేపింది. ఇంజనీరింగ్‌ విద్యార్థిని అయిన బాధితురాలు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తోంది. మార్పింగ్‌ గ్యాంగ్‌ కోసం గాలింపు ముమ్మరం చేయాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

దీంతో నిందితులను పట్టుకునేందుకు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశారు. వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విశాఖ ఏడీజీ ఠాకూర్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఫోటోలను మార్ఫింగ్‌ చేసిన కొందరు వ్యక్తులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు.

చివరకు ఫోటోలు ఇస్తామని నమ్మబలికి ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచార దృశ్యాలను కామాంధులు కెమెరాలో బంధించారు. కాగా, నిందితులను అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

English summary
Man harassing woman by Cell phone in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X