అనుమానం: భార్యను చంపి, గ్యాస్ బండ కింద దాచాడు

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ధర్మవరం జగ్జీవన్ రామ్ నగర్‌కు చెందిన ప్రవల్లిక, రాజేష్‌లు ప్రేమించుకొని, ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల నుంచి జగ్జీవన్ రామ్ నగర్‌లోనే నివాసముంటున్నారు. డ్రైవర్‌గా పనిచేసే రాజేష్ విధులకు తరచూ గెర్హాజరవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
అదే సమయంలో భార్యపై అనుమానం పెంచుకుని ఆమెతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో అనుమానం పెరిగిపోయి ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత భార్య శవాన్ని గోనెసంచిలో కట్టి, వంట గదిలో గ్యాస్ బండ కింద దాచి ఉంచినట్టు పోలీసుల విచారణలో అతను చెప్పాడు.
ఆ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించారు.












Click it and Unblock the Notifications