ఇదేం పిచ్చి.. ప్రపంచ శాంతి కోసం జీవ సమాధికి యత్నించిన వ్యక్తి.. ఎక్కడంటే ?
పిచ్చి పలు రకాలు అంటూ సాధారణంగా పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఆ మధ్య టిక్ టాక్ హవా నడుస్తున్న రోజుల్లో వైరల్ అవ్వడం కోసం ఏదో ఒకటి చేసి పపౌలార్ అయిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఈ రకంగా పిచ్చి పనులు చేసే వాళ్లని చాలా మందిని చూస్తూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తి చేసిన పని భక్తి అనాలో.. పిచ్చి అనాలో ఎవరి విజ్ఞతకి వారికే వదిలేయాలి.
ఇప్పుడు ఈ తరహా ఘటనే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని అంటున్నారు. ఆ నమ్మకంతోనే అమ్మవారిపై భక్తితో 30 అడుగుల లోతులో 30 లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడట.

అంతే కాకుండా భూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉగాది రోజు నాడు అయిదు అడుగుల మేర గుంట తీసుకుని, ఒంటిపై బట్టలు లేకుండా గుంటలోనికి ప్రవేశించాడు. అనంతరం ఆ గుంటపైన ఇనుప రేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని చెప్పగా గ్రామస్తులు ఆ గుంటను పూడ్చారు.
ఈ విషయం గ్రామస్తులు అందరికీ తెలియడంతో అతడిని చూసేందుకు గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అతని దీక్షను భగ్నం చేశారు. జీవ సమాధి నుంచి కోటిరెడ్డిని బయటకు తీసి గుంటను పూడ్చేశారు. సుమారు 5 గంటల పాటు అతను ఆ గుంట లోనే ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదేం పిచ్చి.. ప్రపంచ శాంతి కోసం జీవ సమాధికి యత్నించిన వ్యక్తి.. ఎక్కడంటే ?#Man #ViralVideo #Prakasam #OITelugu pic.twitter.com/Zb2m7h35NH
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2025
ప్రపంచం లోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని.. మొట్టమొదటి సారిగా ఏపీలో తానే ఆలయాన్ని నిర్మించానని కోటిరెడ్డి చెబుతున్నాడు. తన పేరే భూదేవి పుత్రుడని.. ప్రపంచ శాంతి కోసమే ఈ దీక్ష చేపట్టానని అంటున్నాడు. ఈ తరహా ఘటనలకు పాల్పడవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
-
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications