టిడిపిలోకి నేతల వలసలు, లెజెండ్‌లా అన్న బాలయ్య

Mandali joins TDP
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణా జిల్లా మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వర రావు, మండలి బుద్ధ ప్రసాద్ సైకిల్ ఎక్కారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వారు ఈ సందర్భంగా అన్నారు.

చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాము కాంగ్రెస్ వీడి టిడిపిలో చేరుతున్నట్టు చెప్పారు. పిన్నమనేని, బుద్ధప్రసాద్ చేరికతో టిడిపి మరింత బలపడిందని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రను తాను స్వర్ణాంధ్ర చేస్తానన్నారు. అందరు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు.

టిడిపిలో చేరిన వారిలో మాజీ మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వర రావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణవీరయ్య తదితరులు ఉన్నారు. మరోవైపు మంగళవారం ప్రకాశం జిల్లా సంతలపాడు కాంగ్రెసు ఎమ్మెల్యే విజయ్ కుమార్, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి సైతం హస్తం వదిలి సైకిల్ ఎక్కారు. మంగళవారం చంద్రబాబుతో పితాని సత్యనారాయణ భేటీ అయ్యారు. ఆయన త్వరలో టిడిపిలో చేరనున్నారు.

టిడిపిని ఆదరించాలి: బాలయ్య

తన లెజెండ్ చిత్రాన్ని ఆదరించినట్టే తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించాలని ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు సూచించారు. లెజెండ్ సినిమా విజయవంతమైన సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+