కేసీఆర్‌కు ఏపీ నేత మండలి కితాబు, మండిపడ్డ దేవినేని

హైదరాబాద్: రాజకీయ నాయకులు ఎందరో ఉన్నప్పటికీ... సాహిత్యాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసి, ఔపోసాన పట్టిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ బుధవారం కొనియాడారు. అలాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తున్న తెలంగాణలో, చంద్రబాబు సీఎంగా ఉన్న ఏపీలో తెలుగు భాష, సంస్కృతులు వర్ధిల్లుతాయని ఆయన ఆశాభావ వ్యక్తం చేశారు.

కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, ఏపీ సాహితీ - సాంస్కృతిక సంస్థళ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికపై మండలికి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడారు. తెలుగుకు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదని, తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు తనంతు కృషి చేస్తానని చెప్పారు.

Mandali praises Telangana CM KCR

కృష్ణా జలవరులపై ఏపీ వర్సెస్ టి

కృష్ణా నీటి విడుదల పైన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. నీటి విడుదల పైన తెలంగాణ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. నీటి విడుదలను ఖండిస్తున్నామని చెప్పారు. తాగునీటికి అని చెప్పి సాగుకు నీటిని తీసుకు పోతున్నారని ఆరోపించారు.

అబద్దం చెప్పి నీటిని మళ్లీ విడుదల చేయించుకున్నారన్నారు. గతంలో సాగర్ నుండి నీటిని విడుదలచేస్తే డెల్టాకు నాలుగు రోజుల్లో చేరుకునేదని, ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు ఉండటంతో మరో రెండు రెండురోజులు ఆలస్యమవుతోందన్నారు. దీనిని కారణంగా చూపి నీటిని మళ్లీ విడుదల చేయించుకున్నారన్్నారు.

రాజకీయమొద్దు: దేవినేని

నాలుగు జిల్లాలకు మంచి నీరు సరఫరా చేసే విషయంలోను రాజకీయాలు చేయడం తగదని, ఇలాంటి చిన్న పిల్లల చేష్టలు పనికి రావని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు మంచీనిళ్లు అడిగితే ఫిర్యాదులు చేయడం నీరు విడుదల కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడం న్యాయమా అని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాలోని నాలుగు జిల్లాల్లో మంచి నీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరమేనని, మిగిలి నీటిని వెంటనే విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+