బూట్లతో జనసేన ఆఫీస్‌లోకి వెళ్లిన సీఐ..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
మంగళగిరి సీఐ ఉదంతం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళగిరి సీఐ శ్రీనివాసరావు చేసిన ఓ పని ఆయనపై వేటు పడేలా చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు, డిప్యూటి సీఎంగా పవన్ కల్యాణ్‌లు బాధ్యతలు చేపట్టారు. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారాహి దీక్ష ప్రారంభించారు.
దీనిలో భాగంగానే ఆయన 11 రోజుల పాటు ఈ అమ్మవారి దీక్ష చేయనున్నారు. ఈక్రమంలో సీఐ శ్రీనివాసరావు మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోకుండా, భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా ఆగకుండా నేరుగా లోపలికి వెళ్లారు. ఓవైపు పవన్ కల్యాణ్ వారాహి పూజ చేస్తుండగా బూట్లతోనే ఆయన లోపలికి వెళ్లారు. భధ్రతా సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సదరు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను మంగళగిరి టౌన్ సీఐగా నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అయితే వైసీపీ సానుభూతిపరుడనే కారణంగా సీఐ శ్రీనివాసరావుపై వేటు పడిందని తెలుస్తోంది. సీఐ శ్రీనివాసరావుపై గతంలో జనసేనకు వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలు వినిపించాయి. జనసేన కార్యకర్తలను సీఐ శ్రీనివాసరావు కేసులతో వేధించారని తెలుస్తోంది. ఇప్పుడు పవన్ డిప్యూటి సీఎం కావడంతో ఆయనపై వేటు వేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications