ఆ గట్స్ నీకు ఉంటే.. షర్మిలకు సపోర్ట్ చెయ్: జగన్ కు సవాల్
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చేసిన వ్యాఖ్యల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ ఓ వీడియో విడుదల చేశారు.
ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమాన్ని కించపర్చడం సరికాదని అన్నారు. తమ స్వలాభం కోసం పోరాటం చేయట్లేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఉద్యమించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి గానీ తాము భయపడట్లేదని తేల్చిచెప్పారు.

జగనే మోదీకి సరెండర్ అయ్యాడని ఎదురుదాడికి దిగారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటంలో భాగంగా మోదీ- అమిత్ షాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఓ పెద్ద యుద్ధమే చేపట్టాడని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.
గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 30 నుంచి 40 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని బూత్ లల్లో అమిత్ షా ఓట్ల చోరీకి పాల్పడ్డాడని ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన కమిషనర్లు దీనికి సహకరించారని మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను మానిప్యులేట్ చేశారని విమర్శించారు.
ఓట్ చోరీ ఉద్యమంలో భాగంగా బిహార్ లో రాహుల్ గాంధీ త్వరలోనే పాదయాత్రను చేపట్టనున్నారని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇంత చేస్తోన్న రాహుల్ గాంధీని కనీస మద్దతు ప్రకటించాల్సిన బాధ్యత వైఎస్ జగన్ పై ఉందని వ్యాఖ్యానించారు. పైగా చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయంటూ కట్టుకథ అల్లడం సరికాదని చెప్పారు.
ప్రధాని మోదీ- చంద్రబాబు ఒక జట్టయితే.. అమిత్ షా- వైఎస్ జగన్ ఇంకో జట్టు అని మాణిక్కం ఠాగూర్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కూడా ఈ టీమ్ లోనే ఉన్నాడని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షాను ఎదిరించే గట్స్ ఉంటే ఓట్ చోరీలో భాగంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టే మార్చ్ లో పాల్గొనాలని సవాల్ విసిరారు.
My reply to @ysjagan comment on #VoteChori . pic.twitter.com/LPdzefzsoC
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 13, 2025












Click it and Unblock the Notifications