తీరం దాటింది, ఆకస్మిక వరద - విద్యా సంస్థలకు సెలవు..!!

భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు దంచి కొడుతున్నాయి. కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రికార్డు వర్షపాతం నమోదైంది. అయిదు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించారు. తిరుమల పైన భారీ వర్షాల ప్రభావం పడింది. మెట్ల మార్గం మూసివేసారు. ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు.

రికార్డు వర్షపాతం
బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, సీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ వర్షాల కారణంగా టీటీడీ అప్రమత్తమైంది. మెట్ల మార్గం తాత్కాలికంగా మూసి వేస్తూ నిర్ణయించారు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Many places in coastal and Seema districts received heavy to very heavy rainfall as IMD alerts

ఆకస్మిక వరదలకు ఛాన్స్
వాయుగుండం తీరం దిశగా వస్తున్నందున 8 జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరిక జారీచేశారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అంచనా వేసారు. రాత్రి నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కడప, ప్రకాశంతోపాటు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు, చెరువులు, నదులుండే ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

యంత్రాంగం అప్రమత్తం
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం తీరందాటే సమయంలో గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అటు ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. తాజా హెచ్చరికలకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+