వ్యభిచారం చేయాలని ఆమెపై తల్లిదండ్రుల ఒత్తిడి: అతను నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించాడు

ఏలూరు: వ్యభిచారం చేయాలని తల్లిదండ్రులు, సోదరుడు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఓ వ్యక్తి నుంచి 7 లక్షల రూపాయలు తీసుకుని ఆమెను వ్యభిచార రొంపిలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. దాన్ని తట్టుకోలేక ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

తన మరణానికి కారణం తన తల్లిదండ్రులేనని,తనను వ్యభిచారం కూపంలోకి నెట్టాలని వారే యత్నించారని పేర్కొం టూ సూసైడ్‌ నోటు రాసింది. పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలం వేల్పూరులో ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పెందుర్తి నాగపవన్‌ కుమార్‌కి అదే గ్రామానికి చెందిన కృపామణితో నాలుగేళ్లకిందట వివాహమైంది. వీరికి పవన్‌ కార్తీక్‌(3) అనే కుమారుడు ఉన్నాడు.

కొద్దికాలం క్రితం పవన్‌, కృపామణిల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో కృపామణి తల్లి లక్ష్మి పవన్‌పై ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కృపామణి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి కుమారుడితో సహా ఉంటోంది. ఈ క్రమంలో కృపామణిని వ్యభిచారం చేయాలంటూ ఆమె తల్లి లక్ష్మి, తండ్రి రామలింగేశ్వరరావు, తమ్ముడు రాజ్‌ కుమార్‌లు ఒత్తిడి చేయడం ప్రారంభించారని కృపామణి సూసైడ్ నోటులో రాసింది.

Sexual Harassment

సూసైడ్ నోట్‌లో రాసిన వివరాల ప్రకారం - పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుంచి కృపామణి తల్లిదండ్రులు రూ.7 లక్షలు తీసుకుని, కృపామణిని అతనికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక అప్పటి నుంచి కృపామణికి ఇటు తల్లిదండ్రులు, అటు సాయి శ్రీనివాస్‌ నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. సాయి శ్రీనివాస్‌ కృపామణిని లోబరుచుకుని నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు.

జైలు నుంచి భర్త విడుదల కావడంతో కృపామణి తన కుమారుడిని తీసుకుని భర్త ఇంటికి వెళ్లింది. అయినప్పటికీ తల్లిదండ్రులు, సాయి శ్రీనివాస్‌ నుంచి వేధింపులు మాత్రం ఆగలేదు. వ్యభిచారానికి సహకరించకపోతే గతంలో తీసిన వీడియోలు, ఫొటోలు నెట్‌లో పెడతానని బెదిరింపులకు గురిచేశారు.

ఒక రోజు బహిర్భూమికి వెళ్తున్న కృపామణిని సాయి శ్రీనివాస్‌ అడ్డగించి.. ‘నీ భర్త పవన్‌కుమార్‌ను నా పలుకుబడి ఉపయోగించి పోలీసుస్టేషన్‌లో పెట్టించడమే కాకుండా జైలు శిక్ష కూడా పడేలా చేశాను. నాతో సహకరించకపోతే నీకు, నీబిడ్డకు ఇదే గతి పడుతుంది' అని హెచ్చరించాడు.

దాంతో భయాందోళనలకు గురైన కృపామణి - ఈ నెల 19న రాత్రి సూసైడ్‌ నోట్‌ రాసి, దానిని సెల్ఫీ తీసి ఫోన్‌ను టీవీ పక్కనున్న ఓ టేబుల్‌పై పెట్టి అదేరోజు రాత్రి పెద్ద కాలువలోదూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య కనిపించకపోవడంతో పవన్‌కుమార్‌ ఈ నెల 20న తణుకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత 21న పాలకోడేరు మండలం శృంగవృక్షం కాలువ వద్ద కృపామణి శవం కనిపించింది. ఇప్పటికే ఇంట్లో లభ్యమైన సూసైడ్‌ నోట్‌, సెల్ఫీని భర్త మీడియాకు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+