కెసిఆర్‌పై జవదేకర్ ఫైర్, బాబు పదవిస్తే: కెసిఆర్‌పై జైరాం
హైదరాబాద్/కరీంనగర్/నిజామాబాద్: తమ కూతురు కవిత నిజామాబాదులో ఓడిపోతుందనే బాధతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైని ఇష్టారీతీగా మాట్లాడుతున్నారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ నిజామాబాద్ జిల్లాలో అన్నారు.
తెలంగాణలోని ఆత్మహత్యలకు కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్కసారి కూడా పార్లమెంటులో మాట్లాడలేదని చెప్పారు. మోడీ నాయకత్వంలో బిజెపి మూడువందల లోకసభ సీట్లను గెలుచుకోవడం ఖాయమన్నారు. కాంగ్రెసు పార్టీతో ఒప్పందంలో భాగంగానే మోడీని కెసిఆర్ విమర్శిస్తున్నారన్నారు. మాటకు కట్టుబడి బిజెపి తెలంగాణకు మద్దతిచ్చిందన్నారు. రాహుల్ అన్నింటా విఫలమయ్యారన్నారు.

మోడీ గాలి ఉత్తిదే: ఆజాద్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మెదక్ జిల్లా సిద్దిపేటలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాము తెలంగాణ ఇచ్చామన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు తమకే ఉందని చెప్పారు. దేశంలో మోడీ గాలి అన్నది అంతా ఉత్తిదే అన్నారు. కెసిఆర్‌ది కుటుంబ పార్టీ అని ధ్వజమెత్తారు. తెలంగాణలో తాము మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తామన్నారు.
కెసిఆర్ పైన జైరాం
కెసిఆర్‌లా తన కుటుంబం రాజకీయాల్లో లేదని కేంద్రమంత్రి జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే అలవాటు తనకు లేదని కెసిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాడు మంత్రి పదవి ఇస్తే కెసిఆర్ తెలంగాణ కోసమంటూ పార్టీయే పెట్టేవాడు కాదన్నారు. తెలంగాణ అంటే కెసిఆర్ 14 ఏళ్ల ఉద్యమం కాదని, 60 ఏళ్ల చరిత్ర అన్నారు. తెలంగాణ మరో జార్ఖండ్‌లా కాకూడదనే తమ ఆలోచన అన్నారు.












Click it and Unblock the Notifications