విక్రమాదిత్యలో ప్రధాని మోడీ ప్రయాణం (పిక్చర్స్)
పానాజీ: దేశంలోనే అత్యంత పెద్దదైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణం చేశారు. ఆయన దాన్ని శనివారం జాతికి అంకితం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా ఈయ యుద్ధనౌకను సందర్శించారు.
గోవా తీరంలోని ఆరేబియా సముద్రంలో ఉన్న విక్రమాదిత్య యుద్ధనౌకపైకి మోడీ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా నావికా దళం అధికారులు మోడీకి ఘనస్వాగతం పలికి గౌరవందనం సమర్పించారు. యుద్ధనౌకలో నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ కూడా ఉన్నారు.
విక్రమాదిత్య యుద్ధనౌకపై ఉన్న మిగ్ 29కె యుద్ధ విమానం కాక్‌పిట్‌లో మోడీ కాసేపు కూర్చుని అందులోంచి అభివాదం చేశారు. తర్వాత అక్కడి సిబ్బందితో ముచ్చటించారు.

గోవాలో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత పెద్దదైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణించారు. అక్కడికి ఆయన హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

గోవాలో మోడీ
మోడీ ఉద్వేగపూరితమైన తన భావనలను అక్కడివారితో పంచుకున్నారు. నావికా దళం అధికారుల వందన సమర్పణను స్వీకరించారు.

గోవాలో మోడీ
దేశీయ ఆయుధాల ప్రాముఖ్యతను మోడీ వివరించారు. దిగుమతుల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

గోవాలో మోడీ
సవాళ్లను సాధారణంగా తీసుకోవద్దని ప్రధాని మోడీ అన్నారు. మన రక్షణ యంత్రాంగం ప్రపంచంలోనే ఉత్తమంగా ఉండాలని ఆయన అన్నారు.

గోవాలో మోడీ
ప్రధాని మోడీ నావికా దళాధికారులతో మాట్లాడారు. వారి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications