పద్ధతి మార్చుకో, లోకేష్‌కు చెప్తా: బెజవాడ మేయర్‌కు బుద్ధా వెంకన్న, కార్పోరేటర్లను నొప్పించనని

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: గత కొద్ది రోజులుగా విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు కార్పోరేటర్ల మధ్య నెలకొన్న వివాదానికి బుధవారం తెరపడింది. ఈ వ్యవహారంలో టీడీపీ శాసన మండలి చీఫ్ విప్, విజయవాడ అర్బన్ అధ్యక్షులు బుద్దా వెంకన్న చొరవ కొంత ఫలించినట్లుగా కనిపిస్తోంది.

చదవండి: బెజవాడ టీడీపీలో చిచ్చు: తిరుగుబాటు, బాబుపై ఒత్తిడి! మేయర్ ఏం చెప్పారంటే..

ఆయన తొలుత కార్పోరేటర్లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మేయర్‌తో తన నివాసంలో భేటీ అయ్యారు. మేయర్‌తో ఏర్పడిన విభేదాలపై కార్పోరేటర్ల నుంచి ఆరా తీశారు. ఆ తర్వాత మేయర్‌తో భేటీలో ఆయనకు పలు సూచనలు చేశారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని హితవు పలికారు.

చదవండి: ఏడాది ముందు కాదు, ఎలాగంటే: రాజీనామాలపై వైసీపీ వైవీ ట్విస్ట్, బీజేపీ ఎంపీ ఆగ్రహం

కార్పోరేటర్లను నొప్పించనని మేయర్

కార్పోరేటర్లను నొప్పించనని మేయర్

దీంతో మేయర్ కోనేరు శ్రీధర్ స్పందించారు. ఇక నుంచి కార్పోరేటర్ల మనసు నొప్పించకుండా పని చేస్తానని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తానని తెలిపారు. పార్టీ ఇచ్చిన పదవికి నష్టం వాటిల్లకుండా ముందుకు వెళ్తానని చెప్పారు.

మేయర్‌ను తొలగించాలని

మేయర్‌ను తొలగించాలని

కార్పోరేటర్లను అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతానని కోనేరు ప్రసాద్ చెప్పారు. కార్పోరేటర్లు మాత్రం బుద్దా వెంకన్న వద్ద కుండబద్దలు కొట్టారు. మేయర్‌ను ఎట్టి పరిస్థితుల్లోను తొలగించాలన్నారు. పరిస్థితి తీవ్రతను చెప్పిన బుద్దా వెంకన్న.. మేయర్‌కు హితబోధ చేశారు.

మేయర్ దురుసు

మేయర్ దురుసు

అంతకుముందు, కార్పోరేటర్లతో భేటీ సమయంలో వారు మేయర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌ను తప్పించాల్సిందే అన్నారు. రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని అప్పగించాలన్నారు. మేయర్ దురుసుగా మాట్లాడుతారని, కార్పోరేటర్ల అభిప్రాయాలు తీసుకోరని ఆరోపించారు.

ప్రవర్తన మార్చుకోమని చెబుతా

ప్రవర్తన మార్చుకోమని చెబుతా

అయితే, విభేదాలు రచ్చకెక్కకుండా మనం ముందుకు వెళ్లాలని, చిన్న సమస్యలు ఉంటే మేయర్‌ను పిలిచి మాట్లాడుతానని బుద్ధా వెంకన్న కార్పోరేటర్లకు హామీ ఇచ్చారు. ఆ మేరకు మేయర్‌కు హితబోధ చేశారు. మేయర్‌తో మాట్లాడి ప్రవర్తన మార్చుకోమని చెబుతానన్నారు.

లోకేష్‌కు చెబుతా

లోకేష్‌కు చెబుతా

కార్పోరేటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించానని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ మధ్య వివాదంపై చర్చించామని, మేయర్ ప్రవర్తన సరిగా లేదని, ఆయనను మార్చాలని పలువురు కార్పోరేటర్లు డిమాండ్ చేశారని బుద్ధా వెంకన్న కార్పోరేటర్లతో భేటీ అనంతరం చెప్పారు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానానికి, మంత్రి లోకేష్‌కు నివేదిక ఇస్తానని చెప్పారు. మేయర్ మార్పుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada City Mayor Koneru Sridhar, who faces a rebellion of sorts from corporators of his own party, has denied their allegations and has maintained that he enjoys a good equation with the MLAs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి