గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్య ఉద్యోగి ఆత్మహత్య: మార్చురీ ఎదుట ఆందోళన, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు, పరిస్థితి ఉద్రిక్తం

జిల్లాలోని పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవికుమార్...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైద్య ఉద్యోగి ఆత్మహత్య ఉదంతం గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే.. జిల్లాలోని పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవికుమార్... రెండు రోజుల క్రితం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తన పదోన్నతిని అడ్డుకుంటున్నారని, తన చావుకు రత్నరాజు, భానుమూర్తి, ప్రసాద్, మల్లికార్జునరావులే కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్య యత్నానికి ముందు అతడు ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు.

Medical Employee Suicide: Protest before Martury, Slogans against Minister Kamineni, Situation is serious..

ఆత్మహత్యా యత్నం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం రవికుమార్ మృతిచెందాడు. దీంతో రవికుమార్ కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు జీజీహెచ్ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగాయి.

రవికుమార్ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary
A man, Ravikumar who is working as junior assistant in Ponnur PHC of Guntur District commit attempt to suicide two days back is died on Thursday. Before commit to suicide he posted a video in facebook stating that 4 persons are reason for his act. On thursday morning the family members Ravikumar and some more dalit organization members started their protest against his death before the GGH martury demanding for justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X