సంధ్యారాణి ఆత్మహత్య, లక్ష్మిని అరెస్ట్ చేయాలని ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. జూనియర్ డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాలని వారు కొన్ని రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటీష పై సోమవారం విచారణకు చేపట్టారు. అనంతరం ఈ కేసును వచ్చే నేల 3కి వాయిదా వేసారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో కోర్టులో తమ నిరసన తెలిపారు. బెయిల్ పిటిషన్ వేసుకోవడం పట్ల వారు నిరసన తెలిపారు. ఆమె కు బెయిల్ నిరాకరించాలని వారు కోర్టు అధికారులను కోరారు.












Click it and Unblock the Notifications