సెలైన్ బాటిలో విషం: మెడికో ఆత్మహత్య, పరీక్షల భయం

అనంతరం 2009-12లో మెట్టుగూడలోని కేంద్ర రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యంలో పీజీ కోర్సులో చేరింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పరీక్షల్లో ఒక సబ్జెక్ట్‌లో శైలజాశర్మ ఫెయిలైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శైలజ, సప్లిమెంటరీ పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. కాగా ఈనెల 7, 8 తేదీల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం తాను చదువుకుంటానని పనిమనిషికి చెప్పి గదిలోకి వెళ్లింది. ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి చూసేసరికే శైలజ తన గదిలో చలనం లేకుండా పడివుంది. ఈ విషయాన్ని ఇంటి యజమానికి తెలుపగా ఆయన తుకారాంగేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలసులకు అక్కడ సూసైడ్ నోట్ లభించింది.
సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తుకారంగేట్ సిఐ సుదర్శన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్యాంలు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆమె కుటుంబీకులు సోమవారం సాయంత్రానికల్లా నగరానికి చేరుకుంటారని సిఐ సుదర్శర్‌రెడ్డి చెప్పారు. పోస్టుమార్టం పూర్తకాగానే మృతదేహాన్ని మృతురాలి కుటుంబీకులకు అప్పగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications