ఏపీకి ఏలినాటి శని.. శని అనుచరులు ఆ రెండు పార్టీల్లో ఉన్నారు: నాగబాబు

ఏపీలో రాజధాని రగడ ఇంకా కొనసాగుతుంది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలన్న రైతుల పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. రాజధాని రైతుల కోసం పోరుబాట పట్టాయి. ఇక మూడ్ రాజ్దానులే ముద్దు అని వైసీపీ నేతలు రాజధాని దీక్షలకు పోటీగా ర్యాలీలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో రాజధాని విషయంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఇదే సమయంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.ఇక ఈ నేపధ్యంలో తాజాగా రాజధాని అమరావతి రైతులను బాధ పెట్టిన వారికి తప్పకుండా ఉసురు తగిలి తీరుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు.

ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు

ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు

జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని ఒక వ్యవస్థ గాని బాలన్స్ తప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళల్లో మోరల్ డౌన్ అయినట్లు అని ఆయన పేర్కొన్నారు .ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉందని ఆయన విమర్శలు గుప్పించారు .వాళ్ళ మోరల్ టోటల్ గా డౌన్ అయ్యిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి అంటూ నాగబాబు వైసీపీ నేతలు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

 టీడీపీ హయాం నుండే ఏల్నాటి శని ... ఇంకా కొనసాగుతుంది

టీడీపీ హయాం నుండే ఏల్నాటి శని ... ఇంకా కొనసాగుతుంది

ఈ వ్యాఖ్యలు తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ అసభ్య పదజాలం ఉపయోగించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అంతే కాదు ఏపీకి ఏల్నాటి శని పట్టిందని చెప్పారు. ప్రస్తుతం ఏపి స్టేట్ కి ఏలిన నటి శని కాలమే జరుగుతుందన్నారు . ఇక ఇది ఇంకా 7 సంవత్సరాలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు . టీడీపీ హయం లో రైతులని మభ్యపెట్టి రాజధాని పేరుతో వాళ్ళ జీవితాల తో ఆడుకోవడం మొదలు లెట్టటంతో ఏల్నాటి శని మొదలైందన్న నాగబాబు ఇక ప్రస్తుతం వైసీపీ ప్రభుతం తో ఏల్నాటి శని పీక్స్ లోకి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు .

మరో ఏడేళ్ళు ఏల్నాటి శని ప్రభావం ఉండేలా ఉంది

మరో ఏడేళ్ళు ఏల్నాటి శని ప్రభావం ఉండేలా ఉంది

ఇక తాను జాతకాలు నమ్మను గాని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.శని అనుచరులు రెండు పార్టీల్లో చాలా సమర్ధవంతంగా పనిచేస్తున్నారు అని నాగబాబు పేర్కొన్నారు. అంతే కాదు ఇంకో 7 ఇయర్స్ ఏ పి ప్రజలకి తప్పదేమో ఈ బాధ ని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు . ఏల్నాటి శని బిగినింగ్ లో గాని ఎండింగ్ లో గాని తన ప్రభావం ఉధృతంగా చూపిస్తుందని పేర్కొన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే వైసీపీ హయాంలో పీక్స్ లోకి ఏల్నాటి శని ప్రభావం చూపిస్తుంది అనిపిస్తుందన్నారు .

40 ఏళ్ళకు మొదటి దెబ్బ పడింది .. వరుస మొదలైందన్న నాగబాబు

40 ఏళ్ళకు మొదటి దెబ్బ పడింది .. వరుస మొదలైందన్న నాగబాబు

అన్నదాతలైన రైతుల ఉసురు మంచిది కాదని పేర్కొన్న ఆయన రైతులంటే వైసిపి వాళ్ల కి లోకువ అని మండిపడ్డారు .వాళ్ళ ని, వాళ్ల మనోభావలని, అవమానించిన వాళ్ళకి ఉసురు తగలడం మొదలైనదని అంతలోనే చంద్రబాబుని టార్గెట్ చేశారు . చంద్రబాబుకు ఇంతకాలానికి 40 ఏళ్ళకి మొదటి దెబ్బపడిందని పేర్కొన్నారు నాగబాబు . ఇక ఇప్పుడు వరుస మొదలైన్దన్నారు .రాజధాని రైతు సోదరులారా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ల లెక్కలు తేలుతున్నాయని నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+