Naga Babu Konidela: వైసీపీ అటాక్ కు నాగబాబు కౌంటర్- మగముత్తైదువులకు వాయినాలివ్వండి..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో యువశక్తి సభ ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీ ప్రభుత్వాన్ని, అధినేత సీఎం జగన్ నూ తీవ్రంగా విమర్శించారు. దీంతో వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, కాపు నేతలు పవన్ ను రాత్రి నుంచే టార్గెట్ చేస్తున్నారు. దీనికి జనసేన నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఇదే క్రమంలో పవన్ అన్నయ్య నాగబాబు కూడా వైసీపీ రియాక్షన్ పై ఘాటుగా స్పందించారు.
వైసీపీ నేతలు పవన్ ను ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు బదులిస్తూ మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఇవాళ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. మగ ముత్తైదువులు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలపెట్టారంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. రాత్రి పవన్ కళ్యాణ్ యువశక్తి సభ ముగియగానే వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ముందుగా రియాక్ట్ కాగా.. ఆ తర్వాత వరుసగా వైసీపీ నేతలు, ముఖ్యంగా అందులో కాపు నేతలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విమర్శలపై రియాక్ట్ అయిన నాగబాబు.. వైసీపీ మగ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి పంపండని కోరారు.
వై.సీ.పీ. @YSRCParty మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు…
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2023
వాయినాలు ఇచ్చి పంపండి !

గతంలోనూ పలుమార్లు పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసినప్పుడల్లా వారిపై ట్విట్టర్ లో సెటైర్లు వేసిన నాగబాబు ఈసారి వైసీపీ నేతల్ని మగ ముత్తయిదువులంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మగ పతివత్రలు అంటూ అర్ధం వచ్చేలా నాగబాబు చేసిన ట్వీట్ ను జనసేన క్యాడర్, నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దీంతో నాగబాబు కామెంట్స్ పై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. తననుద్దేశించి గతంలోనూ పలుమార్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సోషల్ వార్ చేస్తున్నా నాగబాబు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని మరోసారి ఈ ట్వీట్ తో నిరూపించారు.












Click it and Unblock the Notifications