BIG BOSS : వారంతా నాకు ఒకెత్తు అయితే-ఆ కంటెస్టెంట్ కే నా మద్దతు : నాగబాబు..!!

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్న బిగ్ బాస్- 5 సీజన్ పైన క్రమేణా అంచనాలు పెరుగుతున్నాయి. తొలి రోజున ప్రత్యేక సందడితో ..కంటెస్టెంట్స్ పరిచయంతో మొదలైన బిగ్ బాస్ గతం కంటే భిన్నంగా సాగుతోంది. ట్విస్టులు..గొడవలు సహజంగా షో ప్రారంభమైన కొద్ది రోజుల వరకూ ఉండేవి కావు. కానీ, ఇప్పుడు భిన్నంగా అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కంటెస్టెంట్స్ సైతం తమ వంతు రోల్ సమర్ధవంతంగా పోషిస్తున్నారు.

గతం కంటే భిన్నంగా బిగ్ బాస్ -5

గతం కంటే భిన్నంగా బిగ్ బాస్ -5


అందులో భాగంగా..జెస్సీ మీద యానీ మాస్టర్‌ ఫైర్‌ అవ్వడం, ఎందుకంత హైపర్‌ అవుతున్నావని కాజల్‌కు లహరి చురకలు అంటించడం చూస్తుంటే.. మున్ముందు గొడవలకు ఏ స్థాయిలో ఉంటాయో అనే అభిప్రాయం ఏర్పడింది. ఇదే సమయంలో బిగ్ బాస్ ప్రారంభమైన రోజు నుంచే సోషల్ మీడియాలోనూ సందడి మొదలైంది. హోస్ట్ నాగార్జున మొదలు కంటెస్టెంట్స్ వరకూ వారి పెర్ఫ్మాన్స్ మీద భిన్నాభిప్రాయాల వ్యక్తం అవుతున్నాయి. కంటెస్టెంట్స్ మద్దతు దారులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ పేవరెట్ కంటెస్టెంట్స్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ - రచ్చ

సోషల్ మీడియాలో చర్చ - రచ్చ

కొన్ని సందర్భాల్లో షో గురించి మొదలైన చర్చ..చివరకు రచ్చగా మారుతోంది. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో కంటెస్టెంట్స్ కు ప్రముఖల మద్దతు ఎవరికి ఉందనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే, షో ప్రారంభమైన నాలుగో రోజునే మెగా హీరో నాగబాబు స్పందించారు. తన మద్దతు ఎవరికో స్పష్టం చేసారు. బిగ్ బాస్ -4 ముగింపు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని అద్బుతంగా చేసిన కంటెస్టెంట్స్ కు తన దైన శైలిలో ఆఫర్లు..గిఫ్టులు ఇచ్చారు.

నాగబాబు మద్దతు ఎవరికంటే..

నాగబాబు మద్దతు ఎవరికంటే..

ఇక, ఇప్పుడు నాగబాబు.. బిగ్‌బాస్‌-5లో యాంకర్‌ రవి, యానీ మాస్టర్‌, సింగర్‌ శ్రీరామ్‌, ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు.

Recommended Video

    #BiggBosstelugu5 Ep 3 Analysis With Karthik | Lahari RJ Kajal Fight || Oneindia Telugu
    నాగబాబు మద్దతు వెనుక అసలు కారణం.

    నాగబాబు మద్దతు వెనుక అసలు కారణం.

    లేడీ గెటప్ లో ప్రియాంక జబర్ధస్త్ షో లో లేడీ గెటప్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక సింగ్‌ అని పేరు మార్చుకున్నారు. షో ప్రారంభం రోజున కంటెస్టెంట్స్ పరిచయ సమయంలోనూ తన తండ్రికి నాగార్జున సమక్షం లో ప్రియాంక తాను చెప్పానుకున్న సందేశం చెప్పేసారు. ప్రియాంక విన్నర్‌ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని నాగబాబు సీజన్ ప్రారంభం అవ్వగానే తేల్చి చెప్పేసారు. ఇక, ఇదే తరహాలో పలువురు ప్రముఖులు సైతం ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+